రాష్ట్రీయం

వైజాగ్..ఇక ఫిన్‌టెక్ హబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (జగదాంబ), మార్చి 29: ఐటీ పరిశ్రమల రాకతో త్వరలోనే విశాఖ గ్లోబల్ ఫిన్‌టెక్ హబ్‌గా మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ ఇన్నోవో సొల్యూషన్స్ సహకారంతోఫ్రాంక్లిన్ టెంపుల్‌టెన్ సంస్థ కార్యాలయాన్ని గురువారం విశాఖలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 1947లో ప్రారంభమైన టెంపుల్‌టెన్ కంపెనీ విశాఖకు రావడం గర్వకారణమన్నారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధిలో తన ట్రాక్‌రికార్డ్ చూసి ఈ కంపెనీ విశాఖ వచ్చిందని, దీనిని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా దేశంలో పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు, ఆర్థిక, సేవా రంగాలలో కీలకంగా నిలవాలనే లక్ష్యం చేరుకోవడంలో ఇది కీలకమైన ముందడుగుగా నిలవనుందన్నారు. త్వరలోనే విశాఖ నగరానికి పలు ఐటీ కంపెనీలు వస్తాయని, వారందరికీ అవసరమైన స్థలాలు, వౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫ్రాంక్లిన్ టెంపుల్‌టెన్ సంస్థ సీఈవో జెన్నీ జాన్సన్ మాట్లాడుతూ టెక్నాలజీ అనేది అత్యంత కీలకమైనదని, దీని ద్వారా అంతర్జాతీయ అస్సెట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమ వృద్ధి చెందుతుందన్నారు. ఇన్నోవో సొల్యూషన్స్ సహకారంతో ఏర్పాటు చేసే ఈ సెంటర్ ఒక సారి పూర్తిగా వైజాగ్ కేంద్రంలో కార్యకలాపాలు ప్రారంభిస్తే, సంస్థ టెక్నాలజీ ప్రణాళికలలో కీలకపాత్ర పోషించనుందన్నారు. ప్రస్తుతం 2,800 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, ప్రీమియర్ గ్లోబల్ ఇనె్వస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ సంస్థగా నిలవాలనదే కంపెనీ లక్ష్యమన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ దేశ, విదేశాలలో చంద్రబాబు పర్యటించి పెట్టుబడులను రప్పిస్తున్నారని, విజనరీ ఛీప్ మినిస్టర్‌గా చంద్రబాబుకు మంచి పేరుందన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలలో ఒకటైన ఫ్రాంక్లిన్ టెంపుల్‌టెన్ కంపెనీ విశాఖలో రావడంతో ఈ రోజు చరిత్రలో మిగిలిపోతుందన్నారు. కార్యక్రమంలో ఫ్రాంక్లిన్ టెంపుల్‌టెన్ సీఈవో జాన్సన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించారు.
చిత్రం: ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ సీఈవో జెన్నీ జాన్సన్‌ను సన్మానిస్తున్న
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్