రాష్ట్రీయం

అభివృద్ధే నా ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 29: రాష్ట్రంలో కొన్ని పార్టీలు తనను విమర్శించమే పనిగా పెట్టుకున్నాయని, అభివృద్ధిని అదే పనిగా అడ్డుపడుతున్నాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. ఈ రకమైన విమర్శలకు తాను భయపడేది లేదని, అలాగే వాటిని ఉపేక్షించేదీ లేదని ఉద్ఘాటించారు. తప్పుడు పార్టీలకు సహకరిస్తే, ఉద్యోగాలు పోతాయని ఆయన హెచ్చరించారు. స్థానిక రుషికొండ హిల్-3లో కొత్తగా నెలకొల్పిన కాండ్యుయెంట్ ఐటీ కంపెనీని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ విమర్శకులకు తను భయపడి ఉంటే, హైదరాబాద్‌ను తీర్చిదిద్ది ఉండేవాడినే కాదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను ఐటీ రంగంలో అభివృద్ధి చేయడానికి 14 రోజులు అమెరికాలో పర్యటించి, కంపెనీలను తీసుకువచ్చానని చెప్పారు. సిలికాన్ వ్యాలీలో తెలుగువారి డామినేషన్ పెరగడానికి తానే కారణమని చంద్రబాబు చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాముఖ్యతను తెలియచెప్పామని, ఇప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌పై దృష్టి కేంద్రీకరించామని అన్నారు. రాష్ట్రానికి సంపద తీసుకురావాలని తాను ప్రయత్నిస్తుంటే, దాన్ని అడ్డుకోడానికి అనేక పార్టీలు ప్రయత్నిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. పరిశ్రమలకు భూములు ఇవ్వకుండా కొంతమంది అడ్డుపడుతున్నారని, పరిశ్రమలను ఆకాశంలో నెలకొల్పమంటారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తనను విమర్శించేవారు ఎవరైనా రాష్ట్రానికి కంపెనీలు తీసుకువస్తే, కంపెనీల ఏర్పాటుకు అన్ని విధాలా సహకరిస్తానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలంటే, పెట్టుబడులు రావాలని, కంపెనీల యాజమాన్యాలకు రాయితీలు ఇవ్వకుంటే, ఎందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకువచ్చి, ఉద్యోగావకాశాలు కల్పించాలని తాను చూస్తున్నానని, విపక్షాలు దాన్ని అడ్టుకుంటున్నాయని, మీ భవిష్యత్‌ను మీరే కాపాడుకోవాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 40 దేశాల్లో విస్తరించి ఉన్న ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్‌ను విశాఖకు తీసుకవచ్చామని చంద్రబాబు చెప్పారు. ఐటీ కంపెనీలకు విశాఖ సరైన ప్రదేశమని చంద్రబాబు చెప్పారు. విశాఖను పర్యాటకంగా, ఐటీ పరంగా ప్రపంచ పటంలో గుర్తింపు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విశాఖలో హుదూద్ తుపానును ఉక్కు సంకల్పంతో జయించామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో మూడు సంవత్సరాల్లో 14 వేల ఐటీ ఉద్యోగాలు వచ్చాయని, త్వరలోనే విశాఖలో 600-700 ఉద్యోగులు రానున్నాయని ఆయన తెలిపారు. విశాఖలో చదువుకున్న వారు ఉద్యోగాల కోసం వేరే దేశాలు, రాష్ట్రాలకు వెళ్లక్కర్లేకుండా ఇక్కడే ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. విశాఖలో మూడుసార్లు సీఐఐ సదస్సులు నిర్వహించి 18 లక్షల కోట్ల మేర ఎంఓయూలు చేసుకున్నామని, ఇందులో 10 లక్షల కోట్ల వరకూ పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని చంద్రబాబు చెప్పారు. విశాఖను పూర్తి స్థాయిలో పర్యాటకంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని, ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం మరో 25 వేల నుంచి 30 వేల హోటల్ గదులు అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. ఇందులో భాగంగానే లులూ సంస్థకు కనె్వన్షన్ సెంటర్, మల్టీప్లక్స్‌లు, హోటల్స్ నిర్మాణానికి ఎంఓయూ చేసుకున్నామని, దీన్ని కూడా కొన్ని పార్టీలు వ్యతిరేకించడం బాధాకరమని అన్నారు.
ఐటీ శాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగినప్పుడు 90 శాతం ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో ఉండిపోయాయని అన్నారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకున్న పలుబడితో ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకువస్తున్నారని అన్నారు. ఐటీకి చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాడిసర్ అని అన్నారు. దావోస్‌లో జరిగిన వాణిజ్య సదస్సుకు చంద్రబాబు వెళ్లి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకున్నారని అన్నారు. కాగా, జపాన్ గ్యాస్ట్రోటోప్-ఏపీ ఇన్నోవేషన్ సొసైటీలు సంయుక్తంగా నిర్వహించనున్న వ్యవసాయ, ఆహార రంగాల సాంకేతికత ఏక్సిలరేటర్‌ను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రారంభించారు.
చిత్రం: కాండ్యుయెంట్ ప్రారంభం సందర్భంగా మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు