రాష్ట్రీయం

సీబీఐ విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 29: అవినీతి, అక్రమాలు, దోపిడీ విధానాల ద్వారా పాలనా వ్యవస్థను, ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చి గవర్నర్ వ్యవస్థను, ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయకుండా స్పీకర్ వ్యవస్థను ఇలా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సీఎం చంద్రబాబు భ్రష్టుపట్టించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్ ఆరోపించారు. నాలుగుసంవత్సరాలుగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, అక్రమాలపై కేంద్రం సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి టేపుల్లో ఉన్న గొంతు తనది కాదని కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేసి చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన సచ్చీలత నిరూపించుకోవాలంటే సీబీఐ చివారణకు బాబు సిద్ధం కావాలని పేర్కొన్నారు. నిన్నటి వరకు భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం మీ అవినీతి, దోపిడీలపై మాతో పాటు విడమరచి చెబుతున్నారు కాబట్టి సీబీఐ విచారణ ద్వారా నిజాలు నిగ్గుతేల్చాలని తెలిపారు. స్పీకర్ స్దానంలో ఉండి నల్ల బ్యాడ్జీ పెట్టుకున్న తీరు ఎంతటి దుస్సాహసమో స్పీకర్ కోడెలకు తెలియదా అని ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాలుగా బీజేపీతో కాపురం చేసి ఇప్పుడు కేంద్రం అన్యాయం చేసింది అని చెబుతున్న మాటాలను రాష్ట్ర ప్రజలను విశ్వసించే స్థితిలో లేరన్నారు. రాజధాని వ్యవహారంలో చంద్రబాబు వైఖరి అంతా అవినీతి మయంగానే ఉందన్నారు. ఇక కేంద్రం ఇస్తున్న నిధులకు బాబు చెబుతున్న లెక్కలకు ఎక్కడా పొంతన లేదన్నారు.