రాష్ట్రీయం

లేని చెరువులకు భారీ రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 29: దేశంలోని వివిధ బ్యాంకుల్లో భారీ కుంభకోణాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఐడీబీఐకి చెందిన మూడు శాఖల్లో సుమారు 680 కోట్ల రూపాయల కుంభకోణాన్ని విశాఖ సీబీఐ అధికారులు బయటపెట్టారు. దీనికి సంబంధించి సీబీఐ విడుదల గురువారం విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఐడీబీఐ బ్యాంకుల్లో ఈ కుంభకోణం చోటు చేసుకుంది. రాజమండ్రి, పాలంగి, భీమవరం ఐడీబీఐ బ్రాంచ్‌ల పరిధిలో చేపల చెరువుల పెంపకం నిమిత్తం రైతులకు ఇచ్చే కేసీసీ రుణాల్లో బ్యాంకు ఉన్నతాధికారులు భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ఐడీబీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్ దామోదరన్, డిప్యూటీ జనరల్ మేనేజర్ బట్టు రామారావు కలిసి కుట్ర పూరితంగా బ్యాంకుకు నష్టం కలిగించే విధంగా 24 మంది మధ్యవర్తులు, 26 మంది వాల్యుయేటర్లతో కలిసి సుమారు 680 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. ఒక్కో రైతుకు కెసిసి రుణం గరిష్ఠంగా 25 లక్షలకు మించి ఇవ్వకూడదు. కానీ ఈ ఇద్దరు అధికారులు కలిసి ఒక్కో రైతుకు ఐదు కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి సాహసించారు.
రాజమండ్రి, పాలంగి, భీమవరం బ్రాంచ్‌ల పరిధిలోని 677 బినామీ లబ్దిదారులను వీరంతా కలిసి ఎంపిక చేసుకున్నారు. వాల్యుయర్స్ ఈ లబ్ధిదారుల ఆస్తుల విలువను రెండు, మూడు రెట్లు అధికంగా చూపించారు. వీరు ఎంపిక చేసిన లబ్ధిదారులంతా, ఐదు కోట్ల చొప్పున రుణం తీసుకునేందుకు అర్హులేనని నివేదిక ఇవ్వాల్సిందిగా బ్యాంక్ కింది సిబ్బందికి దామోదరన్, రామారావు ఆదేశించారు. ఉన్నతాధికారులు కోరినట్టే సిబ్బంది నివేదికలు ఇచ్చారు. దీంతో వీరి పేరిట 545.28 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు. లబ్ధిదారులకు సంబంధించిన సరైన డాక్యుమెంట్లు లేకుండానే రుణాలు మంజూరు చేశారు. రుణం మంజూరు చేసే ముందు, చేసిన తరువాత లబ్ధిదారులు దేనికి సంబంధించి రుణం తీసుకున్నారన్న విషయమై బ్యాంక్ అధికారులు పరిశీలన కూడా జరపలేదు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపితే, రుణ మంజూరు లేఖలో పేర్కొన్న చోట ఒక్క చేపల చెరువు కూడా సీబీఐ అధికారులకు కనిపించకపోవడం గమనార్హం. దీంతో ఇది ఒక పెద్ద కుంభకోణంగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ మొత్తాన్ని దామోదరన్, రామారావు దక్కించుకున్నట్టు సీబీఐ గుర్తించింది. ఈ 677 అక్కౌంట్‌లు అన్నీ ఎన్‌పీఏ అయిపోయినట్టు గుర్తించారు. తీసుకున్న రుణంతోపాటు, ఎన్‌పీఏ అయిన తేదీ నుంచి లెక్క వేస్తే సుమారు 680.21 కోట్లుగా తేలింది. దీనికి సంబంధించి 1988 పీసీ యాక్ట్ సెక్షన్ 120-బి, 420, 468, 468 రెడ్‌విత్, 471, సెక్షన్ 13(2)రెడ్‌విత్ 13(1)(డి) కింద ఈనెల 27వ తేదీన కేసులు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు తెలియచేశారు. ఆ తరువాత ఈ ఇద్దరు అధికారులకు సంబందించి, ఏపీ, తెలంగాణలో 18 చోట్ల సీబీఐ దాడులు నిర్వహించి, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.