రాష్ట్రీయం

వౌలిక వసతులు మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/చార్మినార్, మార్చి 29: రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణకు అనుకూలంగా అంతే వేగంగా వౌలిక వసతులను మెరుగుపరుస్తామని, అందుకే మున్సిపల్ చట్ట సవరణ బిల్లును తీసుకువచ్చాయమని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై గురువారం మండలిలో చర్చ అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా రోజురోజుకి పట్టణీకరణ పెరుగుతున్నా, నిజాంపేట, మణికొండ, బండ్లగూడ ఇతర ప్రాంతాలు నేటికీ పంచాయతీలుగానే కొనసాగుతున్నాయని, జీహెచ్‌ఎంసీ పరిధిలో మెరుగైనట్టు ఆ ప్రాంతాల్లో వౌలిక వసతులు మెరుగు కావటం లేదని, అభివృద్ధి సైతం జరగకపోవటం వల్లే మున్సిపల్ చట్టంలో సవరణలు చేసి, ఆ ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. జనాభాను బట్టి పంచాయతీలను మున్సిపాల్టీలుగా గుర్తించే ప్రక్రియకు సంధికాలంలో వినియోగించే పేరే నగర పంచాయతీ అని, దానికి తక్కువ పరిధి, తక్కువ సిబ్బందితో పాటు ఆర్థిక వనరులు కూడా తక్కువగా ఉండటంతో అభివృద్ధి మాట అలా ఉంచితే కనీసం జనాభాకు తగిన విధంగా వౌలిక వసతులను మెరుగుపరిచే పరిస్థితి లేనందున, వీటిని అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇకపై మున్ముందు రాష్ట్రంలో ఎక్కడా కూడా నగర పంచాయతీలుండవని, ప్రస్తుతమున్న పంచాయతీలను మున్సిపాల్టీలుగా గుర్తించనున్నట్లు తెలిపారు. దీంతో ప్రస్తుతం 36శాతం నుంచి 38శాతం వరకున్న పట్టణ జనాభా త్వరలోనే 42నుంచి 43 శాతం వరకు పెరగుతోందని వివరించారు. వీటికి తోడు కొత్తగా 72 పట్టణ స్థానిక సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు, దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల సంఖ్య 147కు పెరగనున్నట్లు తెలిపారు. వీటిలో నాలుగింటిని గవర్నర్ అనుమతి, రాష్టప్రతి ఆమోదంతో అప్‌గ్రేడ్ చేయాల్సి ఉన్నందున, ప్రస్తుతం స్థానిక సంస్థల సంఖ్య 143కు పెరగనున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. పన్నుల భారం పెరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని, అప్‌గ్రేడ్ అయిన తర్వాత రెండు,మూడేళ్ల పాటు పాత పన్నులను వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి సేకరించిన పన్నులను సద్వినియోగం చేయటంలో తాము ధర్మకర్తలుగా వ్యవహారిస్తున్నామని తెలిపారు. అప్‌గ్రేడ్ చేయటంతో ప్రస్తుతమున్న పౌరసేవల నిర్వాహణ, నిర్మాణాల సంబంధిత ప్లానింగ్, వౌలిక వసతులు మెరుగుపడుతాయని మంత్రి సభ్యుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మండలి సమావేశాన్ని తిలకించిన స్పీకర్
గురువారం నాటి శాసనమండలి సమావేశాన్ని శాసనసభ సభాపతి మదుసూధనచారి సభను తిలకించారు. మధ్యాహ్నాం మూడున్నర గంటలకు శాసనమండలిలోని విఐపీ గ్యాలరీకి వచ్చిన స్పీకర్ అక్కడే కూర్చోని సభ జరుగుతున్న తీరును పరిశీలించారు. మండలికి స్పీకర్ రావటంతో చైర్మన్ స్వామీగౌడ్ సభాముఖంగా ఆనందాన్ని, తిలకించినందుకు ఆయన దన్యవాదాలు తెలియజేశారు.