రాష్ట్రీయం

దెబ్బకు దెబ్బకొడదాం - ప్రగతి భవన్ గడీని బద్దలు కొడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: ‘మనకు తాడూ బొంగరం లేదంటారా? అదెలా తిరుగుతుందో చూపిద్దాం. ప్రగతి భవన్ గడీని బద్దలు కొడదాం’ అని తెలంగాణ జన సమితి (టీజేఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం కోదండరామ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ జన సమితికి తాడూ బొంగరం లేదంటారా? అంటూ తెరాస వ్యాఖ్యలపై మండిపడ్డారు. బుధవారం బాగ్‌లింగంపల్లిలోని విఎస్‌టి ఫంక్షన్ హాలులో పార్టీ జెండా, పోస్టర్‌ను ఆవిష్కరించారు. పాల పిట్ట రంగులోని జెండా గురించి వివరించారు. పెద్దఎత్తున హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ తాడు బొంగరం లేదన్నవాళ్లకు, అదెలా తిరుగుతుందో చూపిద్దామని, ప్రగతి భవన్ గడీని బద్దలు కొడదామని అనగానే కార్యకర్తలు కేరింతలు కొట్టారు. కోదండరామ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈనెల 29న నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం వరకూ సన్నాహాక కమిటీలు ఉంటాయని, తర్వాత తాత్కాలిక కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి వెళదామని కోదండం సూచించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి జన సమితిలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారే తమ జన సమితి పార్టీకి స్పూర్తి అని అన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారి జ్ఞాపకార్థం స్పూర్తివనం ఏర్పాటు చేస్తామని ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని విమర్శించారు. న్యాయం కోసం పోరాటం చేస్తే అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు. భావవ్యాప్తి కోసం పార్టీ అవసరం అనిపించిందని, 99 కిలోమీటర్లు నడిచామని, ఇంకో కిలోమీటర్ మిగిలిందన్నారు. 1996నుంచి ప్రొఫెసర్ జయశంకర్‌తో తెలంగాణ ప్రయాణం ప్రారంభించామని, పుట్టుకతోనే ఎవరూ నాయకులు కాలేరని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఇక ఈ ప్రయాణంలో విజయం తమదేనని ఆయన తెలిపారు.
పాల పిట్టకు అపజయం ఉండదు
ఇలాఉండగా పార్టీ జెండా గురించి ప్రొఫెసర్ కోదండరామ్ వివరించారు. పాలి పిట్ట రంగు విజయానికి సంకేతం కాబట్టి ఆ రంగుతో జెండాను రూపొందించామని చెప్పారు. జెండాకు కింది భాగంలో ఆకు పచ్చ రంగు ఉందని, జెండా మధ్యలో అమరవీరుల స్థూపం, చుట్టూ తిరుగుతున్న తెలంగాణ జనం అని ఆయన వివరించారు. స్థూపంపై ఉన్న మల్లెపూవు, ఇంకా మధ్యనున్న ఎరుపు అమరుల ఆకాంక్ష అని, నీలి రంగు దళిత సమాజానికి ప్రతీక అని, పసుపు శుభానికి, విజయానికి సూచికమని, అదే జన సమితికి ఉన్న లక్ష్యమన్నారు. పాల పిట్ట రంగు, కుంకుమపువ్వు రంగు, తంగేడుపూల రంగు, గురుగుపూవు రంగును తెలంగాణ సమాజం ఇష్టపడుతుందని కోదండరామ్ వివరించారు. అడ్వకేట్ రచనారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టంపై మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ లోగడ నెరేళ్ళలో దళితులను ఇసుక మాఫీయాతో లారీలు ఎక్కించి చంపించిన దానికి ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సమావేశంలో గురజాల నరేందర్, ఇన్నయ్య తదితరులు మాట్లాడారు.

చిత్రం: తెలంగాణ జన సమితి పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రొఫెసర్ కోదండరామ్