రాష్ట్రీయం

నష్టపరిహారాల చెల్లింపుల్లో ఏమిటీ వ్యత్యాసం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: భూసేకరణకు సంబంధించి నష్టపరిహారం కేసుల్లో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు సమర్పించిన కేసులకు, కోర్టు సేకరించిన కేసులకు మధ్య చాలా తేడా ఉందని హైకోర్టు పేర్కొంది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఇటీవల విచారణ కోర్టుల్లో భూసేకరణ నష్టపరిహారం కేసులు పెరుగుతున్నాయని, వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల ప్రభుత్వ కార్యదర్శుల రాష్ట్రాల పరిధిలో పెండింగ్ కేసుల వివరాలను సమర్పించారు. తెలంగాణలో 1669 పెండింగ్ కేసులు ఉన్నాయని, నష్టపరిహారం నిమిత్తం రూ. 457.79 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వతేదీలోగా వీటిని చెల్లిస్తామని కోర్టుకు ఆ రాష్ట్రప్రభుత్వం తెలిపింది. ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికలో 918 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.84.32 కోట్ల నిధులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే కోర్టుల్లో రూ.21.55 కోట్లను డిపాజిట్ చేశామని కోర్టుకు ఏపి ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ వివరాలపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను నివేదికలు తెప్పించాలని హైకోర్టు గతంలోనే ఆదేశించింది. కాగా రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.867 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని తేలింది. కాని ఏపి ప్రభుత్వం మాత్రం రూ.84.32 కోట్లను మాత్రమే చెల్లించాలని పేర్కొంది. తెలంగాణలో రూ.967 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. కాని ప్రభుత్వం నివేదికలో రూ.457.79 కోట్లను చెల్లించాల్సి ఉందని కోర్టుకు తెలిపింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన నివేదికలను పరిశీలించి రెండు నివేదికల్లో నష్టపరిహారం చెల్లింపుల్లో ఉన్న వైరుధ్యాన్ని పరిశీలించి వివరణ ఇవ్వాలని హైకోర్టు రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది.