రాష్ట్రీయం

కృష్ణానదిలో టెలిమెట్రీలు బిగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: కృష్ణానది యాజమాన్య బోర్డులో నిర్ణయం మేరకు టెలిమెట్రీలు ఏర్పాటు చేయలేదని కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్‌కు తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి ఎస్‌కె జోషి తాజాగా మరో లేఖ రాసారు. ఇప్పటికే కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఇదే అంశంపై నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి వాడుకుంటున్న నీటి పరిణామాన్ని లెక్కించే వ్యవస్థ లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ నీటిని వినియోగించుకుంటుందని ఎస్‌కె జోషి తన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి అధ్యక్షతన జూన్ 21, 22 తేదీలలో జరిగిన సమావేశంలో రెండు నెలల్లో టెలిమెట్రీలను ఏర్పాటు చేయాల్సిందిగా కృష్ణానది యాజమాన్య బోర్డును ఆదేశించిన విషయాన్ని ఎస్‌కె జోషి తన లేఖలో గుర్తు చేసారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడ్ రెగ్యులేటర్ ద్వారా 55000 క్యూసెక్క్‌ల నీరు గ్రావిటి మీద వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేసుకుందన్నారు. ఇప్పటికైనా ట్యాంపర్‌ప్రూఫ్ టెలిమెట్రీలను ఏర్పాటు చేయాల్సిందిగా ఎస్‌కె జోషి తన లేఖలో పేర్కొన్నారు.