రాష్ట్రీయం

రోడ్డెక్కిన ‘హోదా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 6: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ అన్ని రాజకీయ పా ర్టీలూ, ప్రజా సంఘాలు శుక్రవారం రోడ్డెక్కా యి. నిరసనలతో నగరం అట్టుడికిపోయింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, వంశీకృష్ణ తదితరులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఎం రాష్ట్ర నాయకుడు సిహెచ్.నరసింగరావు, జనసేన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రతినిధి శివశంకర్, టీడీపీ నేత పట్ట్భారాం నేతృత్వంలో విశాఖ నగరంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి జీవీఎంసీ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సీపీఐ, సీపీఎం, జనసేన కార్యకర్తలు హైవేపై పాదయాత్రలు నిర్వహించారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలుగకుండా, హోదాపై ప్రజలను చైతన్యపరిచే విధంగా ఈ పాదయాత్రలు సాగాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు స్థానిక గురుద్వార నుంచి అక్కయ్యపాలెం జంక్షన్ వరకూ మోకాళ్లపై నడి చి నిరసన తెలిపారు. వైసీపీ కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం బీచ్ రోడ్డులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ప్రత్యేక హోదా కోరు తూ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లాలం భవానీ భాస్కర్ నేతృత్వంలో ఉద్యోగులు నల్ల బ్యా డ్జీలు ధరించి లంచ్ అవర్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముస్లింలు స్థానిక అక్కయ్యపాలెం తాజ్‌బాగ్ మసీద్‌లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ హోదా విషయంలో బీజేపీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యా యం చేసిందని అన్నారు. బీజేపీతో లాలూచీపడిన టీడీపీ కూడా ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఈ రెండు పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదని, వచ్చే ఎన్నికల్లో వీరికి బుద్ధి చెప్పాలని అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కనీసం చర్చ కూడా జరపకుండా, సభలను వాయిదా వేసుకురావడం ప్రజాస్వామ్య విరుద్ధమని అ న్నారు. విశాఖకు రైల్వే జోన్ ఇచ్చే విషయంలో కూడా ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయ డం లేదని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా మోదీ వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆప్, లోక్‌సత్తా, ఉత్తరాంధ్ర చర్చా వేదిక నాయకులు పాల్గొన్నారు.
సినిమా వాళ్ళు బయటకు రావాలి!
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, అవార్డులు తీసుకుంటున్న సినిమా వాళ్లు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి బయటకు వచ్చి నిరసన తెలపాలని ప్రత్యేక హోదాపోరాటసమితి నాయకుడు జీ.ఏ.నారాయణ అన్నారు. సినిమా వాళ్లు బయటకు వచ్చి పోరాడకుంటే, వాళ్లు అందుకున్న బిరుదులు రద్దవ్వాలని కోరు తూ హోమం నిర్వహిస్తామన్నారు.

చిత్రం..హోదా కోసం మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలుపుతున్న టీడీపీ కార్యకర్తలు