రాష్ట్రీయం

ఇలాంటి బీజేపీని ఎప్పుడూ చూడలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 6: బీజేపీ సీనియర్ నేతలు వచ్చి కలిస్తే చిన్నా, చితకా నాయకులు కలిసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఇలాంటి బీజేపీని తానెప్పుడూ ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. శాసనసభ సమావేశాల ముగింపు అనంతరం టీడీపీ శాసనసభా పక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బీజేపీలో నాయక త్వ ధోరణి భిన్నంగా ఉందని విమర్శించారు. లాలూచీ రాజకీయాల వల్లే తమిళనాడులో బీజేపీకి ఓట్లు పడలేదని గుర్తుచేశారు. జాతీయస్థాయిలో టీడీపీపై దుష్ప్రచా రం చేశారని, ఏపీలో బీజేపీ ఎదుగుదలకు తాము అడ్డం పడుతున్నట్లుగా చిత్రీకరించారని ఆరోపించారు. ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడాన్ని రాజకీయ నిర్ణయంగా దు ష్ప్రచారం చేశారని గుర్తుచేశారు. తన రెండురోజుల ఢిల్లీ పర్యటనలో బీజేపీ విష ప్రచారాన్ని తిప్పికొట్టామన్నారు. తన పర్యటన ప్రభావం చూసి కలవరంతో తన ఇంటర్వ్యూలను, ప్రెస్‌మీట్‌లను ప్రచారం చేయొద్దని జాతీయ మీడియాపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. రహస్య అజెం డా వల్లే బీజేపీ దెబ్బతింటోందని విమర్శించారు. కేసులు భయంతో తమ నియంత్రణలో ఉంటారని జగన్‌ను చేరదీస్తున్నారని తెలిపారు. స్వతంత్య్ర పంథాలో ఉంటుంద నే టీడీపీని దూరం పెట్టారన్నారు. టీడీపీ ఎప్పుడూ వ్యవస్థలను దుర్వినియోగం చేయలేదని, నాలుగేళ్లలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి పదేపదే చెప్పాలని సూచించారు. చేసిన పనులను చెబుతూనే హక్కుల గు రించి పోరాడాలని పిలుపునిచ్చారు. ఉద్యమాన్ని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలని పోరాటాన్ని సానుకూలంగా మలచుకోవాలని కోరారు. యుద్ధానికి వెళ్లేముందు గెలుస్తామనే ధీమా ఉండాలని, నమ్మకం, విశ్వాసాలే సైనికులకు నూతన జవసత్వాలని వివరించారు. రా త్రి పిలుపునిస్తే 175 నియోజకవర్గాల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించి విజయవంతం చేశారన్నారు. ఈ స్ఫూర్తి చివరిదాకా కొనసాగాలని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. నిర్మాణాత్మక ఆందోళనలకు మద్దతునిస్తానని స్పష్టం చేశారు. అధికార పార్టీ ఉన్నది సమస్యలు పరిష్కరిండానికే కానీ సృష్టించడానికి కాదని తెలిపారు. ప్ర తి ఎమ్మెల్యే పార్టీకి అదనపు బలం చేకూర్చాలని తమ వల్ల పార్టీకి ఎంత బలం చేకూరిందో బేరీజు వేసుకోవాలన్నారు. నాయకుడు ఉన్నాడని అన్నీ ఆయనే చూసుకుంటాడనే ధోరణి కూడా సరికాదని హితవు పలికారు.
చిత్రం..టీడీఎల్పీ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు