రాష్ట్రీయం

ఎంసెట్‌కు 2.13 లక్షల దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: ఇంజనీరింగ్ సహా దాని అనుబంధ కోర్సులు, అగ్రికల్చర్ దాని అనుబంధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎమ్సెట్‌కు బుధవారం సాయంత్రం వరకూ 2,13,029 లక్షల దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్‌లో వెస్ట్ జోన్‌కు 25,050, నార్త్ జోన్‌కు 25,078, సెంట్రల్ జోన్‌కు 33,385, ఈస్టు జోన్‌కు 8782, సౌత్ ఈస్టు జోన్‌కు 42,518 దరఖాస్తులు వచ్చాయి. కరీంనగర్‌కు 13906, ఖమ్మం జిల్లాకు 10817, నల్గొండ 1413, నిజామాబాద్ 1985, వరంగల్ 16,064, తిరుపతి 5201, విజయవాడ 9874, విశాఖపట్టణం 8060, కర్నూలు 5283, కోదాడ 3140, ఆదిలాబాద్ 399, మహబూబ్‌నగర్ 1288, సిద్ధిపేట 791 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇంజనీరింగ్‌కు 1,42,544 , మెడికల్‌కు 69,113, రెండింటికీ కలిపి 1372 వచ్చాయి. 500 జరిమానాతో ఏప్రిల్ 11 వరకూ, వెయ్యి రూపాయిల జరిమానాతో ఏప్రిల్ 18 వరకూ, 5వేల జరిమానాతో ఏప్రిల్ 24 వరకూ, 10వేల జరిమానాతో ఏప్రిల్ 28 వరకూ దరఖాస్తు చేసుకునే వీలుంది. హాల్‌టిక్కెట్లు ఏప్రిల్ 20 నుండి జారీ చేస్తారు. అగ్రికల్చర్ పరీక్ష మే 2, 3 తేదీల్లో జరుగుతుంది. ఇంజనీరింగ్ స్ట్రీం పరీక్ష మే 4,5,7 తేదీల్లో జరుగుతుంది. మే 13 నాటికి ఫలితాలను ప్రకటిస్తారు.