రాష్ట్రీయం

ఒక్క పీహెచ్‌డీకి ఏడేళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: తెలుగు రాష్ట్రాల్లోని పలు విశ్వవిద్యాలయాల్లో ఒక్క పీహెచ్‌డీ పూర్తికావడానికి సగటున ఏడేళ్లు పడుతోంది. కనీసం నాలుగేళ్లలో పూర్తికావల్సిన పీహెచ్‌డీలను యూనివర్శిటీ అధ్యాపకుల సాగతీత, అనుభవ రాహిత్యం, పరిశీలకుల నిర్ల క్ష్యం, నియమనిబంధనల కారణంగా పీహెచ్‌డీల ఆ మోదంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. గతం లో సొంత విశ్వవిద్యాలయంలో ఒకరు అంతర్గత పరిశీలకుడిగా, వేరే విశ్వవిద్యాలయంలో ఒకరు బా హ్య పరిశీలకుడిగా ఉండేవారు. దాంతో ఒకే నగరంలోని రెండు వేర్వేరు వర్శిటీల ఎగ్జామినర్లను పెట్టి పీహెచ్‌డీ తంతు ముగించేవారు. శాస్త్ర విజ్ఞాన రంగాలకు చెందిన అంశాలైతే ఇతర రాష్ట్రాలకు పంపించేవారు, కళలు, భాష, భాషాధ్యయనం, భాషా శాస్త్రాలకు చెందిన అంశాలైతే సొంత రాష్ట్రంలోనే పూర్తి చేసేవారు. గత కొనే్నళ్లుగా పీహెచ్‌డీల నాణ్యత దిగజారడంతో ఎక్స్‌టర్నల్ కాపీని విదేశాల్లోని ఒక వర్శిటీకి పంపించాలనే నిబంధనను కొన్ని యూనివర్శిటీ లు చేర్చాయి. దాంతో సైన్స్ అండ్ టెక్నాలజీ, మోడరన్ సైన్స్, బయోలజీ , ఇంజినీరింగ్ , మేనేజ్‌మెంట్ కోర్సుల్లో కొన్ని యూనివర్శిటీలు పీహెచ్‌డీ కాపీలను విదేశాల్లోని ఎంపిక చేసే ఎగ్జామినర్లకు పంపిస్తున్నాయి. అయితే విదేశీ యూనివర్శిటీల్లో పనిచేసే ఎగ్జామినర్లకు మనం చెల్లించే మొత్తం చాలా స్వల్పం కావడం, భారతదేశ పరిశోధనలపై చిన్నచూపు ఉం డడం, చాలా పరిశోధన పత్రాలు కాపీ కావడంతో వి దేశీ ఎగ్జామినర్లు కొర్రీలు పెడుతున్నారు. ఫలితంగా మూడో ఎగ్జామినర్‌కు పంపించడం లేదా దానిని ర ద్దు చేసి మరోసారి ఇద్దరు ఎక్స్‌టర్నర్‌లకు పంపించడమే మార్గమవుతోంది. దీంతో వర్శిటీల తీరుతెన్ను లు విద్యార్థులకు ఇరకాటంగా మారాయి.
వందేళ్లు నిండిన వర్శిటీలు రెండు, 50-60 ఏళ్లు నిండిన వర్శిటీలు ఐదు, 20ఏళ్లు దాటిన వర్శిటీలు 15 ఉన్నా ఏ ఒక్క వర్శిటీ ప్రపంచ శ్రేణి అత్యుత్తమ వర్శిటీకి కీర్తి పతాకను ఎగురవేయలేకపోతోంది. హై దరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మాత్రం దేశంలో అత్యుత్తమ వర్శిటీల్లో గట్టి పోటీ ఇస్తుండగా, మిగిలిన తెలుగు రాష్ట్రాల్లోని వర్శిటీలు మాత్రం ఆ మా త్రం పోటీని కూడా ఇవ్వలేకపోతున్నాయి. దీనికి కా రణం సిబ్బంది కొరత, కొత్త కోర్సులు, పాఠ్యప్రణాళికలు నవీకరణ జరగకపోవడం, వౌలిక సదుపాయా లు, ల్యాబ్‌లు, మంచి లైబ్రరీలు లేకపోవడం, యూ నివర్శిటీ అభివృద్ధికి నామమాత్రపు ఖర్చు మాత్రమే పెట్టడం, పరిశోధనలు, ప్రచురణలు కారణమవుతున్నాయి. వర్శిటీలకు ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో 90 నుంచి 95 శాతం కేవలం జీతాలు, భత్యాలు, పెన్షన్లు, ఇతర ఖర్చులకే సరిపోతుండగా వర్శిటీల అభివృద్ధి కి, విద్యాత్మక కార్యక్రమాలకు పెట్టే ఖర్చు 5 నుండి 10 శాతం దాటడం లేదు. ఈ కారణం గానే తెలుగు రాష్ట్రాల్లోని వర్శిటీలు అగ్రస్థానానికి చేరుకోలేకపోతున్నాయని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ యూనివర్శిటీలకు ర్యాంకులు ప్రకటించగా, ఓవరాల్ కేటగిరిలో యూ నివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ 11, హైదరాబాద్ ఐఐటీ 22, ఆంధ్రా యూనివర్శిటీ 36, ఉస్మానియా యూనివర్శిటీ 45, ఎస్వీయూ 74వ స్థానంలో నిలిచాయి. వరంగల్ నిట్ 78వ స్థానంలోనూ, కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీ 83వ స్థానం దక్కించుకున్నాయి. అదే యూనివర్శిటీల పరంగా చూస్తే సెంట్రల్ యూనివర్శిటీకి ఐదో స్థానం, ఏయూ 22, ఓయూ 28, ఎస్వీయూ 49, స్విమ్స్ 62, పీజేటీఎస్‌ఏయూకు 82, గీతం వర్శిటీకి 85, హైదరాబాద్ ట్రిపుల్ ఐటీకి 98వ ర్యాం కు దక్కాయి. పరిశోధకుల సంఖ్య పెరిగినపుడు, పరిశోధనలు త్వరితగతిన పూర్తి చేసినపుడు మాత్రమే యూనివర్శిటీలు తమ ర్యాంకులను మెరుగుపర్చుకుంటాయని విద్యావేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సరితూగే పరిశోధనలను హెచ్ యూసీలో నిర్వహిస్తున్నట్టు వర్శిటీ వీసీ ప్రొ. పొదిలి అప్పారావు చెప్పారు. ఫ్యాకల్టీ, విద్యార్థులు సైతం వెబ్‌సైన్స్‌లో 2354, స్కోపస్‌లో 2560 ప్రచురించారని అన్నారు. సైటేషన్లు వెబ్‌సైన్స్‌లో 10507, స్కోపస్‌లో 12458 ప్రచురించారని వివరించారు.