రాష్ట్రీయం

అన్నదాతా.. సుఖీభవ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమలలో శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి 33 సంవత్సరాలు పూర్తయిందని తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు చెప్పారు. భక్తులు విరాళాల ద్వారా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.937 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 1985 ఏప్రిల్ 6న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రారంభించారని అన్నారు. ప్రస్తుతం సాధారణ రోజుల్లో 1.45 లక్షలు, రద్దీ రోజుల్లో 1.90 లక్షలు, ప్రత్యేక పర్వదినాల్లో మూడులక్షల అన్నప్రసాదాలను భక్తులకు అందిస్తున్నామని చెప్పారు. సాధారణ రోజుల్లో ఎనిమిది టన్నులు, రద్దీ రోజుల్లో 10 టన్నులు, ప్రత్యేక పర్వదినాల్లో 12 టన్నుల కూరగాయలను వినియోగిస్తున్నామని, వీటిని దాతలు విరాళంగా అందిస్తున్నారని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 127కోట్లు విరాళంగా అందాయన్నారు. కాగా డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో భక్తుల సూచనల మేరకు ఈఓ ఆదేశాల మేరకు కంపార్టుమెంట్లలో ఉప్మా, పొంగల్‌తోపాటు చట్నీ కూడా అందించాలని ఈఓ ఆదేశించారన్నారు. పదిరోజుల్లో ఈ మేరకు చర్యలు తీసుకుంటామని జేఈఓ వివరించారు.