రాష్ట్రీయం

నేడు ఐఐటీ జేఈఈ మెయిన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీ జేఈఈ మెయిన్స్ పెన్ను- పేపర్ ఆధారిత పరీక్ష నేడు జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇందుకు 25 రీజనల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 11.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, తెలుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా మెయిన్స్‌లో మంచి మార్కులు, స్కోర్ సాధించిన వారి నుంచి రిజర్వేషన్లు ఆధారితంగా 2,24,000 మందిని ఎంపిక చేసి అడ్వాన్స్ పరీక్షకు అనుమతిస్తారు. వారిలో 50వేల మందికి ర్యాంకులు ప్రకటించి, దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటిలు, 23 సిఎఫ్‌టిఐల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. మెయిన్స్ ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 31 ఎన్‌ఐటీల్లో అడ్మిషన్లు ఇస్తారు. 2017లో 11,86,454 మంది రిజిస్టర్ చేసుకోగా, 2016లో 11,94,938 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 2015లో 13,04,495 మంది, 2014లో 13,56,805 మంది, 2013లో 12,82,000 మంది హాజరయ్యారు. 2017లో పేపర్-1ను 11,86,454 మంది రాయగా, అందులో 8,56,897 మంది పురుషులు, 3,29,554 మంది స్ర్తిలు ఉన్నారు. వీరిలో ఆఫ్ లైన్‌లో 9,56,716 మంది రాయగా, ఆన్‌లైన్‌లో 1,65,635 మంది హాజరయ్యారు. వీరి నుంచి అడ్వాన్స్ పరీక్షకు 2,21,427 మంది అర్హత సాధించగా, వారిలో 1,59,540 మంది హాజరైతే, 50,455 మందికి ర్యాంకులు ప్రకటించారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ పట్టణాల్లో కంప్యూటర్ ఆధారితంగానూ, హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో ఆఫ్‌లైన్‌లోనూ పరీక్ష జరుగుతుంది. ఆంధ్రలో అనంతపురం, బాపట్ల, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం, విజయనగరం పట్టణాల్లో ఆన్‌లైన్ పరీక్ష జరుగుతుంది. ఇందులో గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణంలలో ఆఫ్‌లైన్ పరీక్ష జరుగుతుంది. 8న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ పేపర్ -1 జరుగుతుంది. బి ఆర్కిటెక్చర్, బి ప్లానింగ్ పరీక్షలు పేపర్-2 మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకూ జరుగుతుంది. పరీక్ష జవాబుల కీ ఏప్రిల్ 24న విడుదల చేస్తారు. స్కోర్‌లను ఏప్రిల్ 30న ప్రకటిస్తారు. అఖిల భారత ర్యాంకులను మే 31న ప్రకటిస్తారు.
ఎమ్సెట్ నిర్వహణకు భారీ ఏర్పాట్లు
ఎమ్సెట్ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసినట్టు జెఎన్‌టియు హైదరాబాద్ విసి ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ ఎ యాదయ్య తెలిపారు. పరీక్ష మే 2 నుంచి 7 వరకూ ప్రతి రోజు రెండు సెషన్స్‌లో జరుగుతుందన్నారు. మే 2, 3 తేదీల్లో అగ్రికల్చర్, 4, 5, 7 తేదీల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జరుగుతుంది, తొలిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు ప్రాక్టీస్ టెస్టులకు కూడా వీలుకల్పించామని వెల్లడించారు.