రాష్ట్రీయం

అహంకారికి బుద్ధిచెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: అధికార అహంకారంతో విర్రవీగుతున్న సీఎం కేసీఆర్ పతనం వరంగల్ నుంచే మొదలవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం వరంగల్ డీసీసీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, హన్మకొండలో నిర్వహించిన రెండో విడత ప్రజాచైతన్య బస్సు యాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్న ప్రజాచైతన్య బస్సు యాత్రను ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ అభినందించారని, 2019లో తెలంగాణలో తమదే అధికారమని తమకు సందేశం పంపారని ఉత్తమ్ వెల్లడించారు. ఉమ్మడి వరంగల్‌లోని 12 అసెంబ్లీ స్థానాలు స్వీప్ చేయడంతోపాటు వరంగల్ జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ రెండు పార్లమెంటు స్థానాల్లోనూ తామే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో ఆదివారం జరిగే ప్రజాచైతన్య బస్సు యాత్ర యథాతథంగా కొనసాగుతుందని, 9, 10 తేదీల్లో జరిగే బస్సుయాత్రను వాయిదా వేసినట్టు ప్రకటించారు. ఇక్కడ నిర్వహించే బస్సు యాత్ర తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఉత్తర భారతదేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఏఐసీసీ అధినేత ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా 11న జ్వోతిరావుపూలే జయంతి, 14 అంబేడ్కర్ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. మోసపూరిత హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న కేసీఆర్ గత నాలుగేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర
పడ్డాయని, డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు రావడం ఖాయమన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు అహంకారపూరితంగా ఉందన్నారు. వారు విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్నారు. ఏనాడూ రైతు సమస్యలు పట్టించుకోని కేసీఆర్, ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రైతులపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నారని, ఎకరానికి 4వేల రూపాయలంటూ గిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. హైద్రాబాద్ తరువాత రెండో రాజధాని వరంగల్ అని మాటిమాటికీ చెపుతున్న కేసీఆర్, ఆయన అధికారంలోకి వచ్చాక వరంగల్‌కు ఒరగబెట్టిందేమిటని ప్రశ్నించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదన్నారు. మీడియా సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పీసీసీ సభ్యుడు, పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి, మాజీ ఎంపీలు రామ సహాయం సురేందర్‌రెడ్డి, వి.హన్మంతరావు, నాయకులు వేం నరేందర్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, ఆరోగ్యం తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి