రాష్ట్రీయం

అవిశ్వాసాన్ని ఎదుర్కోలేక కాంగ్రెస్‌పై నెపం విడ్డూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 7: పార్లమెంటులో అవిశ్వాసాన్ని ఎదుర్కొనలేక పారిపోయిన ప్రధాని మోదీ, ఆ నెపాన్ని కాంగ్రెస్‌పై వేయడం విడ్డూరమని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈమేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎన్‌డీఏ మిత్రపక్షమైన ఏఐడీఎంకే ఎంపీల ఆందోళనల ద్వారా పార్లమెంటును స్తంభింపచేసి ఆ నెపాన్ని కాంగ్రెస్ పార్టీపై నెట్టడం ప్రధాని అసమర్థతకు నిదర్శనమన్నారు. స్పీకర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని పార్లమెంటు స్థాయిని దిగజార్చారని ఆరోపించారు. ఒక పక్క ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, కాంగ్రెస్ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేయడమే కాకుండా ఈనెల 12వ తేదీన బీజేపీ ఎంపీలు నిరాహార దీక్ష చేస్తారని ప్రధాని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వెనుకబడిన కులాల వారు ఉన్నత పదవులకు చేరుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారంటూ ప్రత్యర్థుల నుద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు శోచనీయమన్నారు. భారత దేశ చరిత్రలో అత్యంత బలహీనమైన, అప్రజాస్వామ్యవాదిగా ప్రధాని నరేంద్ర మోదీ అప్రతిష్ఠ మూటగట్టుకున్నారన్న విషయం నూటికి నూరు పాళ్లు నిజమని తులసిరెడ్డి పేర్కొన్నారు.