రాష్ట్రీయం

ఘనంగా ఉత్తరాంధ్ర వేదవిద్యా సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 7: తెలుగు రాష్ట్రాల నుంచి వేదం నేర్చుకున్న 200 మంది విద్యార్థులు ఇక్కడి శ్రీచక్రపురంలో శనివారం నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యారు. ఉత్తరాంధ్ర వేద విద్యాట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ భాస్కరమూర్తి ఆధ్వర్యంలో 19వ వేదవిద్యా సమ్మేళనం జగత్ జననీ మరో స్వరూపమైన ఏకోత్తర సహస్ర శ్రీచక్రమేవుల వద్ద ఈ వేద విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు ఆదివారం వెల్లడించి వారికి పట్టాలు అందజేస్తారు. టీటీడీ ఆధ్వర్యంలో విజయనగరంలో రెండు వేద పాఠశాలలు, విశాఖపట్నంలో ఒకటి ఉన్నాయని, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు వేదపాఠశాలను ఈ ఏడాదిలోనే ఏర్పాటు చేస్తున్నట్టు భాస్కరమూర్తి వెల్లడించారు. ఈ వేద విద్యార్థులతో ఈ నెల 20, 21, 22 తేదీల్లో జరిగే కోటి రుద్రాక్ష శివలింగార్చన, చతుర్వేద హవనాలతో పాటు పలు హోమాలు నిర్వహిస్తామన్నారు. భారతదేశం వేదభూమి అని, వేదాలు ఇక్కడే పుట్టాయని, అటువంటి వేదాలకు సంబంధించిన 19వ సమ్మేళనం ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. అయితే ఎంతో మహత్తరమైన వేదాల సారాన్ని పట్టించుకోకపోవడం ఎంతో బాధాకరమని ఈ కార్యక్రమానికి హాజరైన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేసారు. సభా అధ్యక్షుడిగా కందుకూరి బసవరాజు వ్యవహరించగా, విశ్వనాథ గోపాలకృష్ణశాస్ర్తి ఆధ్వర్యంలో ప్రవచన నిర్వహించారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు పెద్దఎత్తున పాల్గొన్నారు. సిక్కోల్ జిల్లా మరో ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది...వేదం నేర్చుకునే ఉత్సాహం ఉన్న విద్యార్థులకు శుభవార్తే. ఉత్తరాంధ్ర వేద విద్యాట్రస్టు దేవీ ఆశ్రమం ఆధ్వర్యంలో వేదపాఠశాలను ఈ ఏడాది ప్రారంభించనున్నట్లు వేదవిద్యా ట్రస్టు పాలక దర్మకర్త భాస్కరమూర్తి తెలిపారు. ముందుగా దేవీ ఆశ్రమంలో మూలవిరాట్టుకు శ్రీవిద్యోపాసకులు బాలభాస్కర్‌శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణపతిపూజ, గోపూజ, శోభాయాత్ర, వేద స్వస్తి నిర్వహించారు. గురు వందనం, వేద విద్వాంసులతో చతుర్వేద పారాయణం అనంతరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా దేవీ ఆశ్రమం, ఉత్తరాంధ్ర వేద విద్యాట్రస్టు నడుంబిగించి శ్రీచక్రపుర వేదికగా 19వ ఉత్తరాంధ్ర వేదవిద్యా సమ్మేళనం నిర్వహించడం చాలా ఆనందగా ఉందని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. వేదపండితులు మాట్లాడుతూ నేటి ఆధునిక పోకడల వల్ల మన సంస్కృతి సంప్రదాయాలు మంట గలిసిపోతున్నాయని వేదం కూడా చాలా మందికి అందుబాటులో లేదని అందువల్ల వేద పండితుల కొరత ఉందన్నారు. దేవీఆశ్రమంలో నాలుగు వేదాలు అభ్యసించిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి వారికి ఆయా వేదంలో పట్టాలు ప్రదానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, అదీ శ్రీచక్రపురంలో జరగడంతో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు.

చిత్రం.. వేద పరీక్షలకు హాజరైన ఏపీ, తెలంగాణ విద్యార్థులు