రాష్ట్రీయం

12న నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఏప్రిల్ 7: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఈ నెల 12న పిఎస్‌ఎల్‌వి సి41 ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ సేవలకు సంబంధించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన 7 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.
7వ ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దాని స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ 1-ఐ ఉపగ్రహాన్ని ఇస్రో పంపించేందుకు సిద్ధమయింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఎంఆర్‌ఆర్ సమావేశం ఈ నెల 9న షార్‌లో జరగనుంది. ఈ సమావేశంలో కౌన్‌డౌన్ సమయం తదితర అంశాలపై శాస్తవ్రేత్తలు సమావేశంలో చర్చించనున్నారు.
ఇస్రో వర్గాల సమాచారం మేరకు 12న తెల్లవారుజామున 4.04 నిమిషాలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఇప్పటికే రాకెట్ నాలుగు దశల అనుసంధాన పనులను పూర్తిచేసి శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చారు. మరో రెండు రోజుల్లో ఉపగ్రహం చుట్టూ ఉష్ణకవచాన్ని అమర్చి ఈ పరీక్షలు నిర్వహించిన అనంతరం రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేస్తారు.