రాష్ట్రీయం

..ముందుచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: రాష్టవ్య్రాప్తంగా గ్రామగ్రామాన కంటి పరీక్షల నిర్వహణకు వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధం కావాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇందులో భాగంగా అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు ఉచితంగా అందించాలన్నారు. ఈ మహా యజ్ఞం కోసం ఎన్ని శిబిరాలు, బృందాలు అవసరమవుతాయో ముందుగా ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రగతి భవన్‌లో ఆదివారం వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, సీనియర్ ఐఏఎస్ వాకాటి కరుణ తదితరులతో సిఎం కేసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ‘కంటి పరీక్షల అనంతరం అవసరమైన వారికి అద్దాలు, మందులు ఉచితంగా పంపిణీ చేయాలి. శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని గుర్తించి ఆస్పత్రులకు రిఫర్ చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రులలోనే కాకుండా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఆపరేషన్లు నిర్వహించాలి’ అన్నారు. కంటి పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలను
ముందుగానే సమకూర్చుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 900 వైద్య బృందాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో అవసరమైన పక్షంలో ఇరుగు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వైద్యుల సేవలనూ ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. గ్రామాలతోపాటు హైదరాబాద్ మహానగరం, ఇతర నగరాలు, మున్సిపాల్టీలలో కూడా ఏకకాలంలో కంటి పరీక్షల నిర్వహణకు ప్రణాళిలు రూపొందించుకోవాలని సూచించారు. ‘గ్రామాలు, పట్టణాల్లో చాలా మటుకు ప్రజలు కంటి జబ్బులతో బాధ పడుతున్నారు. కంటి పరీక్షలు చేయించుకునే వెసులుబాటు లేకపోవడం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో, అవగాహన లేకపోవడం వల్లనో చికిత్సలకు దూరంగా ఉంటున్నారు. తమకు జబ్బువున్న విషయాన్ని కూడా గుర్తించకుండా నెట్టుకు వస్తున్నవారున్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించాలి. ప్రభుత్వం పెద్దఎత్తున నిర్వహించబోయే కంటి పరీక్షలపై విస్తృత ప్రచారం చేపట్టాలి. ప్రతీ ఒక్కరూ వైద్య శిబిరానికి వచ్చేలా చైతన్యపరచాలి. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి’ అని సీఎం సూచించారు. ఒకసారి కంటి పరీక్షలు నిర్వహించాక ప్రతీ ఒక్కరికీ కంటి చూపుపై స్పష్టత వస్తుందన్నారు. కంటి పరీక్షలపై అవగాహన కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేదన్నారు. ప్రతీ గ్రామంలో ప్రతీ ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించడం అత్యంత క్లిష్టమైనపనే అయినప్పటికీ అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో, అంకిత భావంతో యజ్ఞాన్ని వైద్య ఆరోగ్యశాఖ సారథ్యంలో విజయవంతం చేస్తుందన్న పూర్తి నమ్మకం తనకుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

చిత్రం..కంటి పరీక్షల నిర్వహణపై ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్