రాష్ట్రీయం

సంక్షేమానికి స్వర్ణయుగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: గడిచిన నాలుగేళ్ళ టీఆర్‌ఎస్ పాలన తెలంగాణకు స్వర్ణయుగంగా మారిందని, ప్రతి పేదవానికి లబ్ధి చేకూర్చటమే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాల అమలులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని రాష్ట్ర ఐటి, పట్టణాభివృద్థి శాఖామంత్రి కె తారక రామారావు, రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయ, హౌజింగ్ శాఖామంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో సోమవారం 200కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రులు రఘునాథపాలెం మండలంలోని శివాయిగూడెం వద్ద 216 డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళను లబ్ధిదారులకు అందజేసి మరో 400ఇళ్ళకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి అధికారంలో ఉన్న పార్టీలు చేయని లబ్ధిని నాలుగేళ్ళలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. దశాబ్దాలకాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అప్పుడేమి చేయలేక ఇప్పుడేదో చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేక ప్రజల సొమ్మును దోచుకున్న
కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వస్తే తాము రెండులక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెబుతూ మాయచేసేందుకు వస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు చేయలేని వారు ఇప్పుడేమి చేస్తారని ప్రశ్నించాలన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకంటే అధికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో 29 లక్షల మందికి పెన్షన్లు అందిస్తే తాము 5500 కోట్ల రూపాయలతో 42 లక్షల మందికి అందిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళు, ఆసరా పెన్షన్, గొర్రెల యూనిట్, కెసిఆర్ కిట్ లాంటివెన్నో చేపడుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న వాటిని చూసి వాటిని అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులకు, హాస్టల్స్‌కు వచ్చేందుకు భయపడేవారని, కానీ నేడు అక్కడికి వచ్చేందుకే సామాన్యులు ఆసక్తి చూపుతున్న విషయాన్ని ఇతర రాష్ట్రాల్లోని బృందాలు పర్యటించి దానిని వారు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని గమనించాలన్నారు. గతానికి భిన్నంగా హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయని, వారికి త్వరితగతిన మంజూరు ఇవ్వడం ద్వారా స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు తిరిగి మరోసారి పోరాడాల్సిన అవసరం లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు దీటుగా ఖమ్మం జిల్లా అభివృద్థి జరుగుతుందన్నారు. భద్రాద్రిని మరో తిరుపతిగా మార్చేందుకు వందకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. మణుగూరు, కెటిపిఎస్ పవర్‌ప్లాంట్లను పూర్తిచేయడం ద్వారా విద్యుత్ రంగంలో మరింత ముందుకు వెళ్తామన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో సీతారామ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాల భూమిని సాగులోకి తీసుకురానున్నామన్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న యాత్ర తీర్థయాత్రను తలపిస్తుందని విమర్శించారు. తాము అధికారంలో ఉన్న సమయంలో తిన్నంత తిని ఇప్పుడు రోడ్లమీదకు వచ్చి ఏదో చేస్తామని చెబుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, పోరాటాలకు మారుపేరుగా ఉన్న తెలంగాణ ప్రజలు వారికి దీటైన సమాధానం చెబుతున్నారన్నారు. విప్లవాలకు, పోరాటాలకు మారుపేరైన ఖమ్మం జిల్లా ప్రజలు ఇచ్చే నినాదాలతో ఇతర జిల్లాలో పర్యటిస్తున్న కాంగ్రెస్ నేతలు పారిపోవాలని ప్రజలను ఉత్తేజపరిచారు.

చిత్రం..డబుల్‌బెడ్‌రూం ఇళ్ళను ప్రారంభిస్తున్న మంత్రులు