రాష్ట్రీయం

మీ నిధులు మీకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: ‘సింగరేణి గనులున్న గ్రామాలన్నీ మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు. అక్కడ వౌలిక సదుపాయాలు కూడా అరకొరగా ఉన్నాయి. వీటికితోడు సింగరేణి బొగ్గు రవాణా వాహనాల వల్ల రహదారులు దెబ్బతినడంతో పాటు కాలుష్యం వల్ల ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుంది’ అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. దెబ్బతిన్న రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెంచాడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. సింగరేణి సంస్థ ద్వారా వచ్చే దాదాపు రూ. 1500 కోట్ల డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్టు (డిఎంఎఫ్‌టి) నిధులతో పాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (నరేగా) నిధులు, నీటిపారుదల శాఖ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సమకూర్చే నిధులు తదితర అన్నింటితో సింగరేణి ప్రాంత అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. ప్రగతిభవన్‌లో మంగళవారం సింగరేణి అధికారులు, ఆ ప్రాంతానికి చెందిన స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఇతర ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ‘సింగరేణి గనుల ద్వారా ఎంతో విలువైన ఖనిజ సంపద వెలికి వస్తుంది. అది జాతి అభివృద్ధికి దోహదం చేస్తుంది. అయితే బొగ్గు గనులున్న ప్రాంతంలో రహదారులు దెబ్బతింటున్నాయి. కాలుష్యం వల్ల ప్రజల జీవితాలు ఛిద్రమై పోతున్నాయి. బొగ్గు గనులున్న ప్రాంతాలే కాకుండా బొగ్గు తరలించే మార్గాల్లో రహదారులు కూడా దెబ్బతింటున్నాయి. గనులున్న ప్రాంతాలు, వాటి ప్రభావం పడుతోన్న ప్రాంతాల్లో అభివృద్ధితో పాటు అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించాలి’ అని సీఎం అన్నారు. సింగరేణి ఇచ్చే నిధులతో పాటు ఇతర నిధులన్నీ కలిపి అవసరమైన అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలి’ అని సూచించారు. జిల్లాల పునర్ విభజన సందర్భంగా సింగరేణి ప్రాంతంలోని మారుమూల ప్రాంతాలైన కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. ఈ జిల్లా కేంద్రాల్లో అభివృద్ధి పనులతో పాటు వౌలిక వసతులు కూడా కల్పించాల్సి ఉందన్నారు. సంబంధిత జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులతో ఆయా జిల్లాల కలెక్టర్లు చర్చించి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఈ పనులు కలక్టర్ల పర్యవేక్షణలో జరగాలని సూచించారు. సింగరేణి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలతో పాటు ఇటీవల ఆ ప్రాంతాల పర్యటన సందర్భంగా తాను ఇచ్చిన హామిలన్నింటినీ నూటికి నూరు శాతం అమలు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఇచ్చిన 17 హామీలను నూటికి నూరు శాతం అమలు చేయడం కోసం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్టు సింగరేణి సీఎండి శ్రీ్ధర్ వివరించారు. ఆర్థిక సంవత్సరం 2017-18లో 6.2 శాతం వృద్థి రేటుతో రికార్డు స్థాయిలో 646 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం పట్ల అధికారులు, కార్మికులను ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ అభినందించారు. ఉద్యమ సమయంలో చెప్పినట్టే తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో సింగరేణి తన వంతు పాత్ర పోషిస్తుందని సీఎం కొనియాడారు.

చిత్రం..సింగిరేణి అభివృద్ధిపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చిస్తున్న సీఎం కేసీఆర్