రాష్ట్రీయం

ఆధునిక విధానాలతో అద్భుత ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: ఆధునిక విధానాలను అమలు చేయడం ద్వారా గత ఏడాది దక్షణ మద్య రైల్వే అద్భుతమైన ప్రగతిని సాధించిందని రైల్వే జీఎం వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన ప్రగతి వివరాలను ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా 16 జోన్లకు గాను దక్షిణ మధ్య రైల్వే ఉత్తమ సేవలు అందిస్తున్న జోన్‌గా అవార్డును అందుకుందని చెప్పారు. లాలాగూడ వర్క్‌షాప్ ఉత్తమ అవార్డును సొంతం చేసుకుందన్నారు. నిత్యం పది లక్షలకు పైగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతూ గత ఆర్థిక సంవత్సరం రూ.13,673కోట్లు ఆదాయాన్ని ఆర్జించిందని వివరించారు. ప్రజారవాణ ద్వారా రూ. 3861 కోట్లు, సరుకు రవాణ ద్వారా రూ.9260కోట్లు ఆర్జించినట్టు తెలిపారు. 113 కిలోమీటర్లు నూతన రైల్వేలైన్లను పూర్తి చేయడంతో పాటు 17 కిలోమీటర్ల డబ్లింగ్, గోదావరి నదిపై భారీ వంతెనతో పాటు తొమ్మిది కిలోమీటర్లు మేర త్రిబ్లింగ్ పనులను పూర్తి చేశామని తెలిపారు. వీటితోపాటు 600 కిలోమీటర్లు విద్యుదీకరణ పనులను పూర్తి చేసి ఆయా రూట్లలో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపారు. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, చిన్నపాటి సంఘటన చోటుచేసుకోకుండా ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు సాదారణ రైళ్లలోను భద్రతను కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు గత ఏడాది 1454 స్పెషల్ ట్రైన్స్‌తో పాటు 7,237 కోచ్‌లను వివిధ రైళ్లకు అనుసంధానం చేసినట్టు వివరించారు. విద్యుత్ ఆదాలో దేశంలోనే ముందజంలో దక్షిణ మధ్య రైల్వే నిలిచిందని, నిర్థేశిత సమయానికి జోన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో ఎల్ ఇడి లైట్లను అమర్చినట్టు వివరించారు. వీటి ద్వారా గత ఏడాది 46.5 లక్షల యూనిట్లను ఆదాచేయడంతో పాటు రూ. 393లక్షలను ఆదా చేశామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేవలం పట్టణ ప్రాంతాల్లోని స్టేషన్లలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని స్టేషన్లలో కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. రైల్వే ఉద్యోగుల సంక్షేమానికి సైతం సంస్థ ఎంతగానో కృషి చేస్తోందని, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగుల పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం ద్వారా వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. చర్లపల్లి రైల్వే టర్నినల్, ఎంఎంటీఎస్ రెండవ దశపై మంత్రి కేటీఆర్‌తో మంగళవారం ప్రత్యేకంగా చర్చలు జరిపినట్టు జీఎం తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై అధిక భారాన్ని తగ్గించేందుకు ఇప్పటికే లింగంపల్లి రైల్వేస్టేషన్ వరకు రెండు రైళ్లను పొడిగించామని, త్వరలోనే మరో రెండు రైళ్లు కూడా ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను తీర్చిదిద్దడం ద్వారా సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే చాలా రైళ్లను ఇక్కడి నుంచి పంపించాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. చర్లపల్లిలో రైల్వే ఆధీనంలో ఉన్న స్థలంతో పాటు మరింత స్థలం అవసరం అవుతుందని చెప్పగా స్థలాన్ని సమకూర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.