రాష్ట్రీయం

ఎన్ని అడ్డంకులు సృష్టించినా టీజేఎస్ ఆవిర్భావం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ జన సమితి ఆవిర్భావాన్ని ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆపలేరని సమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సత్యభారతి ఫంక్షన్ హాలులో టీజేఏసీ జిల్లా గౌరవాధ్యక్షుడు చిగుళ్లపల్లి రమేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన టీజేఎస్ ఆవిర్భావ సభ సన్నాహక సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కోదండరాం మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై సీఎంను అడిగే ధైర్యం లేని మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని ఎద్దేవా చేశారు. పాలకుల నిర్లక్ష్యంతోనే వికారాబాద్ జిల్లా వెనుకబడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన నాపరాయి ఈ జిల్లాలో ఉన్నా ఉద్యోగాలు స్థానికేతరులకు వస్తున్నాయని, కంది పంటకు ప్రాముఖ్యత ఉన్నా కంది బోర్డు ఏర్పాటు కాలేదని వాపోయారు. కనీసం జిల్లాకు సాగునీరు తేవడంలోనూ ప్రభుత్వం విఫలమైందని, ప్రాణహితతో గోదావరి జలాలను జిల్లాకు తేవాల్సి ఉండగా రీడిజైన్ పేరుతో తేలేకపోయారని, కనీసం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌తోనైనా నీరు తెస్తారనుకుంటే నాలుగేళ్లలో అడుగు ముందుకు వేయలేదని ధ్వజమెత్తారు. మిగతా జిల్లాలో నాయకులు గట్టిగా మాట్లాడే నాయకులు ఉన్నందున పనులవుతున్నాయని, వికారాబాద్ జిల్లాలో ప్రశ్నించే ప్రజాప్రతినిధులే లేకుండా పోయారని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నిలదీయని పిరికివారిని గెలిపించుకున్నామని జిల్లా బాధపడుతున్నారని చెప్పారు. 29న టీజేఎస్ ఆవిర్భావ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. అణచివేత ధోరణితో టీజేఎస్‌ను ఆపలేరని, నిరంకుశత్వాన్ని పాతర వేసే రోజులు సమీపించాయని అన్నారు. టీజేఎస్ కమిటీ సభ్యుడు శ్రీశైల రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవ్వరూ సంతోషంగా లేరని అన్నారు. మరో సభ్యుడు రౌతు కనకయ్య మాట్లాడుతూ ప్రతిపక్షాలు లేకుండా చేయాలనుకున్న టీఆర్‌ఎస్ కోటలు బద్ధలు కొడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సన్నాహక కమిటీ సభ్యుడు చింతా స్వామి, టీజేఏసీ జిల్లా చైర్మన్ సోమశేఖర్, కన్వీనర్ గడ్డం రాంచందర్, టీవీవీ జిల్లా అధ్యక్షుడు టీ.నర్సింలు, పరిగి ఇన్‌చార్జి నాగేశ్వర్, మాణిక్‌రెడ్డి, నాయకులు విక్రం, యాదప్ప, మాజీ సర్పంచ్ ఆనందం, లాలయ్య, జగదీశ్ పాల్గొన్నారు.
టీజేఎస్‌లో చేరిక
పార్టీ ఆవిర్భావం కాకముందే మర్పల్లి, కోట్‌పల్లి, మైలార్‌దేవరంపల్లి గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు పలువురు టీజేఎస్‌లో చేరారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించగా, టీజేఎస్ ఆవిర్భావ సభ ప్రచార చైతన్య రథాన్ని కోదండరాం ప్రారంభించారు.
చిత్రం..సదస్సులో మాట్లాడుతున్న కోదండరాం.