రాష్ట్రీయం

బీజేపీ, సీపీఐ బాహాబాహీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 12: ప్రధాని మోదీ ఒక్క రోజు నిరాహార దీక్షకు మద్దతుగా గురువారం విశాఖలో బీజేపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బీజేపీ, సీపీఐ కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. స్థానిక మహిళా కళాశాలకు ఎదురుగా బీజేపీ గురువారం రిలే నిరాహార దీక్షను ప్రారంభించింది. ఈ దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శిబిరంలో నాయకులు మాట్లాడుతున్న సమయంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి నాయకత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు బీజేపీ శిబిరం వైపు ఊరేగింపుగా వెళ్లారు. ప్రధాని మోదీ, బీజేపీ నాయకులు ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో బీజేపీ శిబిరంలో ఉన్న పార్టీ కార్యకర్తలు సీపీఐ కార్యకర్తలపై రాళ్లు, చెప్పులు విసిరారు. తొడగొట్టి సవాల్ చేస్తూ, సీపీఐ కార్యకర్తలను రెచ్చగొట్టారు. అంతేకాకుండా బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు దూసుకువచ్చి, సీపీఐ కార్యకర్తలతో బాహాబాహీకి దిగారు. ఒక మహిళ పట్ల అసభ్యకరంగా కూడా ప్రవర్తించారు. దీంతో సీపీఐ కార్యకర్తలు కూడా బీజేపీవారితో తలపడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితిని పోలీసులు ముందుగా ఊహించలేదు. శిబిరం వద్ద ఉన్న కొద్దిమంది పోలీసులు వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం అందించడంతో పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని, ఇరు వర్గాలను చెదరగొట్టాయి. సీపీఐ కార్యకర్తలను అరెస్ట్ చేసి త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ బీజేపీ వారిపై దాడి చేయాలని చంద్రబాబు పార్టీ సీపీఐ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చినట్టు కనిపిస్తోందని అన్నారు. ఎంపీ హరిబాబు మాట్లాడుతూ హోదా గురించి జనానికి తెలియచెప్పింది తామేనని అన్నారు. ఎవరు ఎన్ని దాడులు చేసినా, వాస్తవాలను ప్రజలకు తెలియచెబుతామని ఆయన అన్నారు.