రాష్ట్రీయం

ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: సినీరంగంలో మహిళల పట్ల జరుగుతున్న లైంగిక వేధింపులపై నటి శ్రీరెడ్డి చేస్తున్న నిరసనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) స్పందించింది. క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలను సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ ఆ మేరకు నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర సమాచార ప్రసార శాఖలకు నోటీసులు జారీచేసింది. అలాగే పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి కమిటీని ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుబట్టింది. ఇది ప్రభుత్వ అసమర్థ చర్యగా అభివర్ణించింది. నటి శ్రీరెడ్డితో ఎవరూ నటించబోరన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నిర్ణయం సరైనది కాదని పేర్కొంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ల్ల శ్రీరెడ్డి జీవనోపాధి హక్కును, గౌరవప్రదంగా జీవించే హక్కును ఉల్లంఘించడమేనని ఎన్‌హెచ్‌ఆర్సీ వెల్లడించింది. తెలుగు సినిమా రంగంలో లైంగిక దోపిడీపై కొన్ని రోజులుగా శ్రీరెడ్డి చేస్తున్న ఆందోళన.. ఫిల్మ్‌చాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన.. మీడియాలో వచ్చిన కథనాలను ఎన్‌హెచ్‌ర్సీ సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, కేంద్ర సమాచార ప్రసారాల శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఇలాంటి వ్యవహారాలను పరిష్కరించేందుకు అందుబాటులో ఓ యంత్రాంగం లేదా కమిటీ ఉందా? అని ప్రశ్నించింది. లైంగిక వేధింపులపై చర్యలు తీసుకోకుండా ‘మా’తోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఆమె గొంతు నొక్కాలని యత్నిస్తోందని కమిషన్ అభిప్రాయపడింది.