రాష్ట్రీయం

పసలేని దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: ప్రమాణ స్వీకారం చేసే ముందు పార్లమెంట్ మెట్లకు మొక్కి అడుగుపెట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పార్లమెంటరీ విధానాలు, సంప్రదాయాల పట్ల గౌరవం ఉంటుందని భావించారని, కానీ అవిశ్వాసంపై ఆయన వ్యవహరించిన తీరుతో ఈ నమ్మకం తలకిందులైందని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. పార్లమెంట్ సజావుగా సాగనీయలేదంటూ ప్రధాన మంత్రి చేసిన ఉపవాస దీక్ష నమ్మశక్యంగా లేదన్నారు. ఎవరైతే సభను సాగనీయకుండా చేశారో వాళ్లే తాము బాధితులం అన్న రీతిలో దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. గురువారం ఉదయం పవన్‌కళ్యాణ్ సీపీఎం, సీపీఐ నేతలు సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా సాధనకు చేపట్టే కార్యక్రమాల కార్యాచరణ, ప్రధాన మంత్రి, బీజేపీ చేపట్టిన దీక్ష తదితర అంశాలపై చర్చించారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ బంద్ పిలుపునకు మద్దతు ఇవ్వాలని జనసేన, సీపీఎం, సీపీఐ నిర్ణయించాయి. అనంతరం పవన్‌కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ లెఫ్ట్‌నెంట్ గవర్నర్, కేంద్ర ప్రభుత్వం తనకు సహకరించడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన నిరసనను అపహాస్యం చేసినవాళ్లు ఇపుడు అదే తరహాలో దీక్షలు చేస్తున్నారని అన్నారు. ప్రధాని ఓ బలీయమైన శక్తి అని ప్రజలతో పాటు తాను కూడా విశ్వసించానని అయితే అవిశ్వాసం తీర్మానాన్ని చర్చకు రాకుండా చేసి ఆ నమ్మకాన్ని కోల్పోయారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం, విభజన చట్టంలోని హామీలను అమలుచేయడంలో బీజేపీ తప్పులు చేసిందని, అందుకే దాటవేత ధోరణితో వెళ్లారని అన్నారు. అవిశ్వాసంపై రెండు రోజులు చర్చిస్తే అన్నీ తెలిసేవని, చర్చను చేపట్టి ఉంటే వారి చిత్తశుద్ధి ఏమిటో తేలేదని అన్నారు. అలాగే టీడీపీ, వైకాపాలు కూడా తప్పులు చేశాయని విశే్లషించారు. చర్చకు రాకుండా చూడటం మూడు పార్టీలకు అవసరమని తెలిపోయిందని, ఇపుడు వాళ్లే తిరిగి ప్రదర్శనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. యువత ఆకాంక్షలకు తగ్గట్టు ప్రజలకు బాధ్యతగా ఉండే రాజకీయాలకు శ్రీకారం చుట్టేలా మూడో శక్తి వస్తోందని, పార్లమెంట్ సజావుగా సాగలేదంటూ దీక్షలు చేస్తున్న వాళ్లు తదుపరి వస్తే తాము ఎలా హోదా తీసుకువస్తారో సమాధానం చెప్పాల్సి ఉంటుందని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర బంద్ కార్యక్రమం నేపథ్యంలో 15న అనంతపురం, 24న ఒంగోలు, మే 6న విజయనగరంలో జరగాల్సిన కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు పవన్ చెప్పారు. ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి పి మధు మాట్లాడుతూ బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలవాలని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పార్లమెంట్‌ను గౌరవించని ప్రధాని తన తప్పును ప్రతిపక్షాలపైకి నెట్టేస్తున్నారని ఆరోపించారు.