రాష్ట్రీయం

మోదీపై ఇక యుద్ధమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 12: రాష్ట్రానికి ప్రత్యేక హోదా తదితర అంశాల్లో అన్యాయం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యుద్ధం ప్రకటించారు. మంత్రివర్గ భేటీ, దళిత తేజం కార్యక్రమాల కారణంగా సైకిల్ ర్యాలీలను ఈ నెల 21కు వాయిదా వేశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య నేతలతో గురువారం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బ్రిటీష్ ప్రభుత్వానికి, బీజేపీకి తేడా లేదని మండిపడ్డారు. ప్రధాని దీక్ష చేయడం ఎప్పుడైనా చూశామా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మోదీ అన్యాయం చేశారన్న చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకూ రాజీ పడేది లేదని మరోసారి స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశం, దళిత తేజం కార్యక్రమాల కారణంగా సైకిల్ ర్యాలీలను ఈ నెల 21కు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20న దళిత తేజం సభను భారీగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఈ నెల 21 నుంచి 28 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీలు, ప్రత్యేక హోదా సదస్సులను నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ నెల 20న తిరుపతిలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై కూడా చర్చించారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని రాజకీయం చేస్తే ప్రజలు క్షమించరని సీఎం వ్యాఖ్యానించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు ఉన్న మార్గాలను అనే్వషించాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావును ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో వైకాపా అధినేత జగన్ పర్యటన కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. రాజధానికి తాను వ్యతిరేకమన్న రీతిలో జగన్ వ్యవహార శైలి ఉందని సీఎంకు మంత్రులు వివరించారు. పార్లమెంట్ జరుగకుండా తామే అడ్డుకుని, తామే దీక్షలు చేయడం బీజేపీకే చెల్లిందని కొంతమంది మంత్రులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.