రాష్ట్రీయం

మన దిక్సూచిఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ప్రయోగం విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఏఫ్రిల్ 12: అంతరిక్ష రంగంలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది...రోదసీ పరిశోధనలో ఇస్రో మరోసారి తన సత్తాచాటింది. దేశీయ ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలన్న కలను సాకారం దిశగా ఇస్రో మరోసారి విజయఢంకా మోగించింది. రోదసీ అధారిత సొంత దిక్సూచి వ్యవస్థను కలిగివున్న అతికొద్ది దేశాల సరసన సగర్వంగా చేరింది. ఈ సేవల కోసం అమెరికాకు చెందిన జీపీఎస్‌పై ఆధారపడాల్సిన అగత్యం ఇక తప్పిపోనుంది. స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్‌లోని తొమ్మిదో ఉపగ్రహమైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐని శాస్తవ్రేత్తలు గురువారం దిగ్విజయంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఘనత సాధించింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని పోలార్ శాటిలైట్ వాహక నౌక ద్వారా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్ర సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్ )కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుండి తెల్లవారు జామున 4గంటలకు 4నిమిషాలకు ఇస్రో ప్రయోగించింది. ఇస్రోకు నమ్మిన బంటు అయిన సోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పీఎస్‌ఎల్‌ఎల్‌వీ-సీ 41 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా మోసుకెళ్లింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహ వ్యవస్థ భూతల, ఆకాశ, సాగరాల్లో దిశ నిర్ధేశ సేవలందిస్తోంది. విమానాలు, ఓడల గమనాన్ని నిర్దేశించడలో సాయపడుతోంది. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థలో తొమ్మిదో ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ 41 వాహక నౌక రోదసీలోకి మోసుకెళ్లింది. 32 గంటల కౌంట్‌డౌన్ మైనస్ 0కు చేరగానే...తెల్లవారుజామున సరిగ్గా 4గంటల 4నిమిషాలకుగంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 33 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. అంచనాలకు తగ్గట్టుగానే..అద్భుతంగా నాలుగు దశలు రాకెట్ పయనం విజయవంతంగా సాగిపోయింది. ఈ ప్రయోగం కోసం పీఎస్‌ఎల్‌వీకి సంబంధించిన ఎక్స్‌ఎల్ వెర్షన్ మోటార్లను ఇస్రో ఉపయోగించింది. ఇందులో ఆరు ఘన రాకెట్ స్ట్రాపాన్ మోటార్లను వాహక నౌకకు అనుసంధానించారు. దీని వల్ల మొదటి దశలో అదనపుశక్తి లభించింనట్టయింది. ఈ వెర్షన్ గల మోటార్లను ఇస్రో ఉపయోగించడం ఇది 20వ సారి. ప్రయోగం జరిగిన 19:19నిమిషాలకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ నిర్ధేశిత కక్ష్యలోకి చేర్చింది. 284+ 20657 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార ఉప బదిలీ కక్ష్యలోకి ఉపగ్రహం చేరింది. షార్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్ నుండి రాకెట్ గమనాన్ని పరిశీలిస్తున్న శాస్తవ్రేత్తలు ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరుగానే కరతాళ ధ్వనులతో ఆనందం వ్యక్తం చేశారు. వెంటనే ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమని ప్రకటించి శాస్తవ్రేత్తలకు అభినందలు తెలిపారు. మిషన్ కంట్రోల్ సెంటర్ నుండే ఆయన మాట్లాడుతూ ఇది భారత ప్రజలందరి విజయమని ఇస్రో శాస్తవ్రేత్తలకు అభినందనలు తెలిపారు. కక్ష్యలోకి చేరిన వెంటనే ఉపగ్రహంలోని రెండు సౌర ఫలకాలు తెరచుచకొన్నాయి. కర్ణాటకలోని హసన్‌లో ఉన్న ఇస్రో నియంత్రణ కేంద్రం పరిధిలోకి ఇది వచ్చింది. వారం రోజుల్లో ఉపగ్రహంలోని ధ్రవ ఇంధనాన్ని మండించడం ద్వారా దాన్ని నిర్ణీత తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. గతంలోను నావిగేషన్ సేవలకు సంబంధించిన 8 ఉపగ్రహాలను శాస్తవ్రేత్తలు రోదసీలోకి పంపించి ఉన్నారు. ఇందులో 1ఎ ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దాని స్థానంలో గత ఏడాది ఆగస్టు 31న 1హెచ్ ఉపగ్రహాన్ని పంపంగా అది విఫలం చెందింది. మళ్లీ సొంత నేవిగేషన్ రూపకల్పనకు ఇస్రో దాని స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని విజయవంతంగా రోదసీలోకి ప్రవేశపెట్డడంతో దేశ సొంత దిక్సూచికి నాంది పలికింది. ఇస్రో 12సంవత్సరాల కలను ఈ ప్రయోగం ద్వారా సాకారం చేసింది.

మనకూ సొంత నావిగేషన్...
తాజాగా కక్ష్యలోకి చేరిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐతో మనకంటూ సొంత దిక్సూచి వ్యవస్థకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఉపగ్రహ బరువు 1425కిలోలు. ఇది 12సంవత్సరాలు పాటు సేవలు అందించనుంది. భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నావిగేషన్ సిరీస్‌లో ఇది చివరిది. దిక్సూచి వ్యవస్థ కోసం రూ.3925కోట్ల వ్యయం ఖర్చుచేశారు. దీంతో రోదసీలో మన జిపీఎస్ సేవలు ఊతం పలికారు. ఈ వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి వచ్చాక మూడు ఉపగ్రహాలు భూస్థిర కక్ష్యలో ఉంటాయి. నాలుగు ఉపగ్రహాలు భూ అనువర్తిత కక్ష్యలో ఉంటాయి. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐను విజయవంతంగా ప్రయోగించడంతో ఏడు దిక్చూచి ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినట్లయింది. దీంతో ఈ వ్యవస్థ సేవల ప్రారంభానికి మార్గం సుగమమైంది. నిజంగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు కింద 7 ఉపగ్రహాలు ఉంటాయి. సేవలు ప్రారంభించాడానికి నాలుగు ఉపగ్రహాలు సరిపోతాయి. వీటికి మరో మూడింటిని జోడించడం ద్వారా కచ్చితత్వం విశ్వసనీయత పెరుగుతాయి. భారత దేశం చుట్టూ 1500కిలో మీటర్ల దూరం వరకు ఈ ఉపగ్రహ వ్యవస్థ సేవలందిస్తుంది.
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌తో ప్రయోజనాలు...
ఈ వ్యవస్థ భూ, జల, వాయు మార్గాలకు స్థితి, స్థాన, దిక్కులను తెలియజేస్తుంది. డ్రైవర్లకు దృశ్య, స్వర దిశా నిర్ధేశం చేస్తుంది. వాహన గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలోను, నౌకల సమూహ నిర్వహణలోను సాయపడతుంది. విపత్తుల సమయంలో సహాయ బృందాలక సమాచారాన్ని అందిస్తుంది. మొబైల్ ఫోన్‌తో అనుసంధానం అవుతుంది.