రాష్ట్రీయం

ఇంటర్ ఫలితాలు వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి/ అనంతపురం సిటీ, ఏప్రిల్ 12: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన కె తేజవర్దన్‌రెడ్డి ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో విద్య అభ్యసించిన తేజవర్దన్‌రెడ్డి 992 మార్కులతో మొదటి స్థానంలో నిలిచారు. అనంతపురం జిల్లా విద్యార్థిని కురుబ షైనిత బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. అనంతపురం నగరంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదువుతున్న కురుబ షైనిత బైపీసీలో 990 మార్కులు తెచ్చుకొని ప్రథమ ర్యాంకు సాధించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు, ఏఏజీఎం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. రామగిరి మండలం పేరూరు గ్రామానికి చెందిన కురుబ నాగిరెడ్డి, వనజ దంపతుల కుమార్తె షైనిత రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. షైనిత తండ్రి నాగిరెడ్డి న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా షైనిత మాట్లాడుతూ కాలేజీలో అధ్యాపకులు, ఇంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను మంచి మార్కులు సాధించానని తెలిపారు. రోజులో 10 గంటల సమయం చదువుకునేందుకు కేటాయించానన్నారు. తనకు 990 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులో మరింత బాగా చదివి మంచి మార్కులు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఉత్తమ ప్రతిభ ద్వారా కావలి పట్టణానికి, కళాశాలకు పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చినందుకు తేజవర్దన్‌రెడ్డిని కళాశాల యాజమాన్యం, పట్టణానికి చెందిన పలువురు అభినందనలతో ముంచెత్తారు.