రాష్ట్రీయం

బ్యాంకర్లకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతుబంధు’ (రైతులకు ఎకరానికి నాలుగువేల రూపాయల పెట్టుబడి సాయం) పథకంతో బ్యాంకర్లు సంబురాలు చేసుకుంటున్నారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు ప్రభుత్వమే గ్రాంటుగా ఎకరానికి నాలుగువేల రూపాయలు ఇవ్వడం వల్ల తమపై ఆర్థిక భారం, వత్తిడి బాగా తగ్గుతోందన్నది బ్యాంకర్ల ఆనందానికి కారణంగా తెలుస్తోంది. వానాకాలం పంటల సీజన్ వచ్చే ముందే రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం ఏర్పాటు చేసి రుణప్రణాళికను వెల్లడించేందుకు బ్యాంకర్లు తీవ్రమైన వత్తిడికి గురయ్యే పరిస్థితి. ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన రైతుబంధు పథకంతో బ్యాంకులు ఇచ్చే ‘పంటరుణాల’ లో గణనీయమైన మార్పులు వస్తాయని తెలుస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధుతో 2018-19 ఆర్థిక సంవత్సరం బ్యాంకర్లు ఇచ్చే పంట రుణాల పరిమితి తగ్గిపోతుందని ఆర్థిక రంగ నిపుణులు అంచనావేస్తున్నారు. రైతులు వేసే పంటలను బట్టి కాస్త అటుఇటుగా
ఎకరానికి ఐదు వేల నుండి 20 వేల రూపాయల వరకు బ్యాంకర్లు రుణాన్ని ఇచ్చేవారు. ఈ రుణం కోసం బ్యాంకులు ఆపసోపాలు పడేవి. వానాకాలం పంటల కోసం రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఏప్రిల్ నుండే కసరత్తు మొదలుపెట్టేవారు. బ్యాంకర్లు ఏటా రూపొందించే వార్షిక రుణ ప్రణాళికలో పంట రుణాలకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తూ వస్తోంది. 2016-17 లో ఖరీఫ్ (వానాకాలం) పంటలకు బ్యాంకర్లు దాదాపు 15 వేల కోట్లు, 2017-18 లో సుమారు 20 వేల కోట్ల రూపాయలు రుణాలుగా ఇచ్చాయి. కొన్ని బ్యాంకులు రుణాలు ఇవ్వడాన్ని కాగితాలకే పరిమితం చేసేవి. రైతులు తీసుకున్న రుణం తిరిగి చెల్లించినట్టు, మళ్లీ కొత్తగా రుణం ఇస్తున్నట్టు రికార్డులు సృష్టించేవి. వాస్తవంగా ఎదురయ్యే కొన్ని సమస్యలను అధిగమించేందుకు ఈ తరహా విధానాన్ని బ్యాంకులు అమలు చేయడం బహిరంగ రహస్యంగా కొనసాగుతోంది.
పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకర్లు విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల వద్ద నగదు లేకపోవడం, డిపాజిట్లు గణనీయంగా తగ్గిపోవడంతో విపత్కర పరిస్థితి ఏర్పడ్డది. ప్రాధాన్యతా రంగమైన వ్యవసాయానికి పంట రుణాలు, ఇతరత్రా వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు డబ్బు లేకపోవడంతో గతంలో ఎదురవని విపత్కర పరిస్థితిని బ్యాంకులు ఎదుర్కొంటున్నాయి. రైతుబంధు పథకంతో రైతులు చాలా వరకు రుణాల కోసం బ్యాంకులకు రావడం బాగా తగ్గిపోతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక చేయూతతో పాటు సొంత డబ్బు కొంత వేస్తే పంటలకు పెట్టుబడి సరిపోతుందని భావిస్తున్నారు. దాంతో బ్యాంకుల వద్దకు రైతులు రావడం గణనీయంగా తగ్గుతుంది.
రైతుబంధు పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి నియమావళిని (గైడ్‌లైన్స్) రూపొందించలేదు. భూమి పట్టా కలిగిన ప్రతి రైతుకు భూమి విస్తీర్ణాన్ని బట్టి ఆర్థిక సాయం చేస్తారు. తక్కువ భూమి ఉన్నా, ఎక్కువ భూమి ఉన్నా ప్రభుత్వం సాయం అందుతుంది. ఈ పరిస్థితిలో పంట రుణాల వత్తిడి తగ్గి తమకు ఊరట లభిస్తుందని బ్యాంకర్లు సంబరపడుతున్నారు.