రాష్ట్రీయం

ఎల్‌ఇడి పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యుత్ ఆదాకు ఎల్‌ఇడి బల్బులు వినియోగిస్తే సాలీనా ప్రతి వినియోగదారుడిపై విద్యుత్ భారం రూ.250 నుంచి రూ.550 వరకు తగ్గుతుందని సిఎం చంద్రబాబు అన్నారు. విద్యుత్ ఆదాపై ప్రజల్లో పెద్దఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆదివారం విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎల్‌ఇడి బల్బుల పంపిణీ మొదటి దశవల్ల 421 ఎంయు విద్యుత్ ఆదా అయ్యిందన్నారు. ఎల్‌ఇడి బల్బుల మార్పిడి కేంద్రాలను 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలన్నారు. నాలుగు జిల్లాలో కేంద్ర విద్యుత్ శాఖ థర్డ్ పార్టీ ద్వారా 57,667 ఇళ్లలో సర్వే నిర్వహించిందన్నారు. సాలీనా ప్రతి ఇంట్లో 73.7 ఎంయు విద్యుత్ ఆదా అవుతున్నట్టు సర్వేలో వెల్లడైందన్నారు. ఈనెల 27న నెల్లూరులో జరిగే కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ మంత్రి సర్వే నివేదికను విడుదల చేస్తారన్నారు. ప్రతి ఇంటికి విద్యుత్ ఆదా చేసే ఐదు స్టార్ల ఫ్యాన్లను వాయిదాల పద్ధతిలో ఇచ్చే పథకాన్ని రాష్టమ్రంతా అమలు చేస్తే బాగుంటుందన్నారు. దీనివల్ల 40 శాతం విద్యుత్ ఆదా అవుతుందన్నారు. ఎల్‌ఇడి బల్బులకు సంబంధించి 50 యూనిట్లలోపు విద్యుత్ వాడే వారికి సాలీనా రూ.213.7 పైసలు, 51-100 యూనిట్ల లోపువారికి రూ.383.2 పైసలు, 101- 200 యూనిట్లలోపు వాడే వినియోగదారులకు రూ.530.6 పైసలు ఆదా అవుతుందన్నారు. సమీక్ష సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్, విద్యుత్ సలహాదారు కె రంగనాథం, ఏపి ట్రాన్స్‌కో ఫైనాన్స్ డైరెక్టర్ దినేష్‌కుమార్, డిస్కాంల చైర్మన్లు ఆర్ ముత్యాలరాజు, హెచ్‌వై దొర పాల్గొన్నారు.