రాష్ట్రీయం

గురుకులాలకు ఉమ్మడి పరీక్షా విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: గురుకులాలు అన్నింటికీ ఉమ్మడి పరీక్షా విధానం అమలుచేయాలని, ఉమ్మడి మెనూ, సమాన వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ గురుకులాల పనితీరును గురువారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. తెలంగాణ గురుకులలను దేశంలోనే నెంబర్ వన్ గురుకులలుగా తీర్చిదిద్దాలని సూచించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో తెలంగాణ నుండి ఎక్కువ మంది విద్యార్థులు సీట్లు సాధించేలా కృషి జరగాలని చెప్పారు. వేసవిలో ప్రతి విద్యాసంస్థనూ ప్రత్యేకంగా పర్యవేక్షించి, అక్కడి వసతులను మెరుగుపరచాలని సూచించారు. కిరాయి భవనాల్లో కూడా వసతులు కల్పించాలని, ఏమైనా మరమ్మతులు అవసరముంటే వెంటనే చేయాలని అన్నారు. విద్యార్థులు అందరికీ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించాలని అన్నారు. బాలికలకు న్యాప్కిన్స్ సరిపడా ఇవ్వాలని, పది నెలలకు కాకుండా 12 నెలలకు సప్లయి చేయాలని
అన్నారు. చాలా మంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. రక్తహీనత ఉన్న బాలికలకు ప్రత్యేక పోషకాహారం ఇవ్వాలని సూచించారు. ఇక ప్రతి గురుకులంలో ఫస్టు ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉండాలని, ఒక ఏఎన్‌ఎం ఉండాలని చెప్పారు. అదే విధంగా క్రీడలు, ఆటలు ప్రోత్సహించేందుకు పీఈటీ కూడా ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి గురుకుల విద్యాలయంలో సీసీ కెమరాలు, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, డిజిటల్ క్లాసులు నిర్వహించాలని అన్నారు. ఐదు గురుకులాల్లో కల్పించే వసతులు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో కూడా ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. గురుకులాలు ప్రవేశాల్లో కూడా నియోజవర్గాల వారీ స్థానికులకు ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశంపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రస్తావించారని, దానిని దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. కొత్త జిల్లాలను యూనిట్‌గా తీసుకుని అడ్మిషన్లు నిర్వహిస్తే సమస్యకు కొంత పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, గిరిజన శాఖ కార్యదర్శి మహేశ్ దత్త ఎక్కా, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి బుద్దప్రకాశ్, మైనార్టీ శాఖ కార్యదర్శి దానకిశోర్, ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ , మైనార్టీ గురుకులవ కార్యదర్శి షఫీ, బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి బట్టు మల్లయ్య, విద్యాశాఖ గురుకులాల కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.