రాష్ట్రీయం

ఫ్రంట్‌పై మరో అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకరావడానికి బీజేపీ, కాంగ్రెస్ కూటములకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేశారు. ఫ్రంట్ ఏర్పాటుపై ఇప్పటికే కోల్‌కత్తా వెళ్లి తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమత బెనర్జీతో చర్చించి వచ్చిన ఆయన శుక్రవారం బెంగళూరు వెళ్తున్నారు. అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడను కలిసి ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించనున్నట్టు టిఆర్‌ఎస్ వర్గాల సమాచారం. శుక్రవారం ఉదయం 9.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లి తిరిగి సాయంత్రం ఐదు గంటలకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. బెంగళూరు చేరుకోగానే నేరుగా దేవెగౌడ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమవుతారు. కొద్దిసేపు చర్చించిన అనంతరం ఆయనతో కలిసి కేసీఆర్ మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఆ తర్వాత మరోసారి కూడా దేవెగౌడతో సమాలోచనలు జరుపుతారు. ఫ్రంట్ ఏర్పాట్లపై ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో సిఎం కేసిఆర్ చర్చించిన విషయం తెలిసిందే. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి ఈ అంశంపై కేసీఆర్‌తో చర్చించి వెళ్లారు. రాజకీయ పార్టీల అధినేతలతోనే కాకుండా కొంత మంది మేధావులు, జర్నలిస్టులు, ఆర్థికవేత్తలు, సినిమా నటులతో నేరుగా చర్చించగా, మరికొందరితో ఫోన్లో కేసీఆర్ పలుదఫాలుగా చర్చలు జరుపుతున్నారు. ఫ్రంట్ ఏర్పాటు దిశగా తాను జరిపిన చర్చల వివరాలను, దేశంలో తాజా రాజకీయ పరిస్థితిపై దేవెగౌడతో కేసీఆర్ సమాలోచనలు జరుపనున్నారని టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. ఇలా ఉండగా రైతుబంధు పథకం ద్వారా వ్యవసాయానికి ఉచిత పెట్టుబడిని సమకూర్చే పథకాన్ని ప్రకటించిన సందర్భంగా దేవెగౌడ స్వయంగా కేసిఆర్‌కు ఫోను చేసి అభినందించారు. రైతులు, వ్యవసాయం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించడానికి తాను స్వయంగా హైదరాబాద్‌కు వస్తానని కూడా ఇదివరకే దేవెగౌడ సిఎం కేసిఆర్‌కు చెప్పారు. అయితే ‘పెద్దవాళ్లు మీరు రావడం ఏమిటీ, నేనే స్వయంగా బెంగళూరుకు వచ్చి కలుస్తాను’ అని చెప్పిన విషయాన్ని కేసిఆర్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అంశంపై కూడా దేవెగౌడతో చర్చించడానికి సిఎం కేసిఆర్ బెంగళూరు వెళ్తునున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసాక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లపై పూర్తి దృష్టి సారించనున్నట్టు ఇదివరకే కేసిఆర్ మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే.

ప్రముఖ ఆర్థికవేత్త గోవిందరావు భేటీ
ప్రముఖ ఆర్థికవేత్త, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డైరెక్టర్ మారపల్లి గోవిందరావు గురువారం ప్రగతి భవన్‌కు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు నేపథ్యంలో దేశంలో ప్రస్తుత ఆర్థిక విధానం, పన్నులు, బడ్జెట్ రూపకల్పన, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంయుక్త ఆధ్వర్యలో కొనసాగే పథకాలు, కార్యక్రమాలపై గోవిందరావుతో సిఎం కేసిఆర్ చర్చించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.