రాష్ట్రీయం

మేలు కోసమే ఫ్రంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: ‘దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీల నేతృత్వంలోని ప్రభుత్వాల వైఫల్యమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కారణం’ అని టిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. దేశానికి మేలు చేసే లక్ష్యం కోసమే తప్ప చిల్లర రాజకీయాల కోసం ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడం లేదని ఉద్ఘాటించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా జాతీయ నాయకులతో సమాలోచనలు జరుపుతున్న కేసీఆర్ శుక్రవారం బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) పార్టీ అధినేత దేవెగౌడ, ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమయ్యారు.
భేటీ అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకరావడమే ఫెడరల్ ఫ్రంట్ ఆశయమన్నారు. ‘దేవెగౌడ ప్రధాన మంత్రిగా అత్యున్నత పదవి నిర్వహించగా, తెలంగాణ రాష్ట్ర కల సాకారం చేసి, సక్సెస్‌ఫుల్ సీఎంగా పేరు తెచ్చుకున్నా’ అని కేసిఆర్ అన్నారు. దేశ హితం, ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో కాంగ్రెస్, బిజేపీలకు ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు దిశగా సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. తమ అపారమైన రాజకీయా అనుభవంతో దేశానికి ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన తప్ప మరో ద్యాస లేదని కేసీఆర్ స్పష్టం చేసారు. దేశాన్ని కాంగ్రెస్, బిజెపీలు 65 ఏళ్ల కంటే ఎక్కువే పాలించగా, కొంతకాలం పాటు మురార్జీ దేశాయ్, విపి సింగ్, చంద్రశేఖర్, చరణ్‌సింగ్, దేవెగౌడ తదితరులు పాలించారన్నారని కేసీఆర్ అన్నారు. ఎక్కువ కాలం పాలించిన పార్టీల హయాంలో
దేశానికేమి చేయలేకపోయారన్నారు. ఇందుకు తాజా ఉధాహరణనే కావేరి జల వివాదమన్నారు. కర్నాటక, తమిళనాడు మధ్య దశాబ్ధాల తరబడిగా కావేరి జల వివాదం కొనసాగుతుందన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వాల వైఫల్యం కారణం కాదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న అనేక వివాదాలు, జల వివాదాల పరిష్కారంలో కాంగ్రెస్, బిజేపీ ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయన్నారు. కృష్ణా జలాల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసినా ఏదైనా పరిష్కారం లభించిందా? అని కేసిఆర్ ప్రశ్నించారు. మాజీ ప్రధానిగా పని చేసిన దేవెగౌడ లాంటి పెద్దల సహకారంతో దేశంలో మార్పు తీసుకవచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం చేస్తున్న తమ ప్రయత్నానికి జెడియు, టిడిపి, సిపిఐ, సిపిఎం తదితర పార్టీలు కలిసి రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఫ్రంట్‌లో చేరడానికి టిడిపి, వామపక్ష పార్టీలు ఆసక్తి కనబరస్తున్నాయన్నారు. కర్నాటకలో జరుగుతున్న ఎన్నికల్లో ఇక్కడి తెలుగు ప్రజలంతా దేవెగౌడ నేతృత్వంలోని జెడియుకు ఓటు వేయాలని కేసిఆర్ పిలుపునిచ్చారు. దేవెగౌడ కానీ ఆయన కుమారుడు కుమారస్వామి కానీ కోరితే కర్నాటక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సిద్ధమని కేసిఆర్ స్పష్టం చేసారు. కర్నాటకలో కానీ, ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న కర్నాటకలోని ప్రాంతాల్లో ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దేవెగౌడ సంపూర్ణ సహకారం అందించారని, తెలంగాణ ప్రజల తరఫున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని కేసిఆర్ చెప్పారు.
ప్రజల ఫ్రంట్‌కు సహకరిస్తాం: దేవెగౌడ
దేశంలో పరిష్కారం కానీ సమస్యలు ఎన్నో ఉన్నాయని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. దేశంలో రైతులు క్లిష్ట పరిస్థితుల్లో ఉండి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సిఎం కేసీయర్ రైతులకు అండగా నిలిచి ఎన్నో మంచి పనులు చేస్తున్నారని దేవెగౌడ కొనియాడారు. 70 ఏళ్లుగా దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేసీయర్ ముందడుగు వేసారని, ఆయన ఏర్పాటు చేయబోయే ప్రజల ఫ్రంట్‌కు తాము సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేసారు. ‘తమది మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్ కాదని, పథకాల ఆధారిత ఫ్రంట్’ అని దేవెగౌడ అభివర్ణించారు. అంతకుముందు ‘ఎల్లారిగీ నమస్కార’మంటూ కేసీఆర్ మీడియాను కన్నడంలో సంభోందించారు. నటుడు ప్రకాశ్‌రాజు తనకు మంచి మిత్రుడని ఒక ప్రశ్నకు సమాధానంగా కేసీఆర్ వివరించారు.
చిత్రం: ఫ్రంట్ ఏర్పాటుపై బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశమైన సీఎం కేసీఆర్