రాష్ట్రీయం

బాలికలదే పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం ఉదయం బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుశీల్ కుమార్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మధుసూధనరెడ్డి పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షల్లో జనరల్ అభ్యర్ధులు 4,15,366 మంది, వొకేషేనల్ అభ్యర్ధులు 40,423 మంది పరీక్ష రాయగా జనరల్‌లో 1,42,840 మంది గ్రేడ్ ఎ, 68,828 మంది బి గ్రేడ్‌లో, 33,656 మంది సి గ్రేడ్‌లో, 15,234 మంది డి గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. మొత్తం మీద జనరల్
అభ్యర్ధులు 2,60,558 మంది వొకేషనల్ 23,666 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌లో జనరల్ 62.73 శాతం, వొకేషనల్‌లో 58.55 శాతం పాసయ్యారు. జనరల్‌లో బాలికలు 2,11,744 మంది హాజరుకాగా వారిలో 1,45,791 మంది బాలురు 2,03,622 మంది హాజరుకాగా వారిలో 1,14,767 మంది పాసయ్యారు.
బాలికలదే పైచేయి
ఇక ద్వితీయ సంవత్సరంలో జనరల్ అభ్యర్ధులు 3,95,721 మంది హాజరుకాగా వారిలో 67.06 శాతం మంది అంటే 2,65,360 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో ఎ గ్రేడ్‌లో 1,52,001, బి గ్రేడ్‌లో 72,815 మంది, సి గ్రేడ్‌లో 30,519 మంది, డి గ్రేడ్‌లో 10,025 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 2,05,086 మంది పరీక్షకు హాజరుకాగా వారిలో 1,49,091 మంది అంటే 72.70 శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,90,635 మంది హాజరుకాగా వారిలో 60.90 శాతం అంటే 1,16,269 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఫస్టియర్‌లోబాలికలు 68.85 శాతం, బాలురు 56.36 శాతం, సెకండియర్‌లో బాలికలు 72.70 శాతం, బాలురు 60.90 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొత్తం మీద బాలికలదే పైచేయి అయింది.
గత మూడేళ్ల ఫలితాలను విశే్లషిస్తే ఫస్టియర్‌లో 2016లో 53.55 శాతం, 2017లో 57.37 శాతం, 2018లో 62.73 శాతం ఉత్తీర్ణులయ్యారు. అదే సెకండియర్‌లో 2016లో 62.95 శాతం, 2017లో 67 శాతం, 2018లో 67.06 శాతం ఉత్తీర్ణులయ్యారు.
పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం
మొత్తం మీద గత ఏడాది కంటే ఫలితాలను బాగా మెరుగుపరుచుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మార్కుల రిజిస్టర్‌లను ఐదు రోజుల్లో ఆయా జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారులకు పంపుతామని ఆయన చెప్పారు. వాటిని 18వ తేదీలోగా పోందాలని అభ్యర్ధులకు తొందరగా అందజేయాలని చెప్పారు. ఏదైనా పొరపాట్లు ఉంటే వాటిని సంబంధిత ప్రిన్సిపాల్స్ ద్వారా మే 14వ తేదీలోగా బోర్డుకు పంపించాలని పేర్కొన్నారు.
20వ తేదీలోగా పరీక్ష ఫీజు
అడ్వాన్స్ సప్లిమెంటు రాయాలనుకునే ఫస్టియర్, సెకండియర్ అభ్యర్ధులు ఈ నెల 20వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని కోరారు. అలాగే ఫస్టియర్ అభ్యర్ధులు ఇంప్రూవ్‌మెంట్ రాయవచ్చని అందుకు సబ్జెక్టుకు 150 రూపాయిలు చెల్లించాలని సూచించారు. అన్ని సబ్జెక్టులు రాసిన అభ్యర్ధుల్లో ఎక్కువ మార్కులు ఏవి వస్తే వాటిని తీసుకుంటామని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ఫస్టియర్ కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిన వారు పాసైన సబ్జెక్టులకు కూడా హాజరుకావచ్చని, అయితే గతంలో పాసైన సబ్జెక్టుల మార్కులను మాత్రం కలపబోమని అన్నారు.
ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం
2016లో ఇంటర్మీడియట్ పాసైన అభ్యర్ధులు ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం కల్పిస్తున్నట్టు బోర్డు కార్యదర్శి చెప్పారు. ఆ అభ్యర్ధులు రెండు మార్లు ఇంప్రూవ్‌మెంట్ రాసుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు.అటువంటి వారు సెకండియర్ పేపర్లు, ప్రాక్టికల్స్‌కు లేదా ఫస్టియర్‌తో కలిపి అన్ని సబ్జెక్టులకు కూడా హాజరుకావచ్చని అన్నారు.
చిత్రం: ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి