రాష్ట్రీయం

రాబడి పుష్కలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రపంచంలో మేలిమి పాలన, ఉత్తమ సాంకేతిక విధానాలు ఎక్కడున్నా ఆదర్శంగా తీసుకుంటామని, వాటిని రాష్ట్రానికి అన్వయించుకుంటూ అనుసరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. తాము సింగపూర్ నుంచి ఎంతో నేర్చుకుంటున్నామని, ఎంతో విశిష్టమైన సంస్కృతి, సంప్రదాయాలు ఉన్న భారత్ నుంచి కూడా సింగపూర్ ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు. తన తొలి ప్రాధాన్యం ఐటీ రంగానికేనని స్పష్టం చేశారు. తమ దేశంలో ఐటీ రంగానికి, వ్యవసాయ శుద్ధి పరిశ్రమలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఆధారిత ఆహార శుద్ధి పరిశ్రమలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, హార్డ్‌వేర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ‘పారిశ్రామికవేత్తలైన మీకిదే మా ఆహ్వానం. మీ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానమైన ఆంధ్రప్రదేశ్‌కు రండి. పెట్టుబడులు పెట్టండి’ అని పిలుపునిచ్చారు. సింగపూర్‌లో శుక్రవారం జరిగిన ‘హెచ్‌టీ మింట్ ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్’లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికతను పాలనలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిగా, సంస్కరణవాదిగా చంద్రబాబును ఆ సమ్మిట్‌లో అభివర్ణించారు. సదస్సులో సభికులు సహా పలువురి ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. రాజధాని అమరావతిపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం. నాలుగేళ్ల పసికూన. అత్యంత జాగరూకతతో సాకవలసిన బిడ్డ. రాజధాని కూడా లేకపోవడం ఈ రాష్ట్రానికి అన్నింటి కంటే పెద్ద సంక్షోభం’ అని చంద్రబాబు చెప్పారు. కొత్త రాజధానికి చాలినంత భూమిని సమకూర్చుకోవడం పెద్ద సవాలని, భూమిని ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై మథనం చేశానన్నారు. అంత భూమిని సమకూర్చుకునేందుకు అవసరమైన డబ్బు కూడా తమ దగ్గర లేదన్నారు. అన్నీ ఆలోచించి ఒక్క పిలుపునిచ్చానని, తన పిలుపునందుకొని రాజధాని రైతులు తక్షణం స్పందించారని చెప్పారు. సింగపూర్ తరహా నగరాన్ని నిర్మిస్తానని ఎంతో నమ్మకంగా చెప్పానని, రైతులు 33వేల ఎకరాల విలువైన భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చారని ముఖ్యమంత్రి వివరించారు. రాజధాని నిర్మాణం కోసం బృహత్తర ప్రణాళికను రూపొందించాలని తాను తొలుత సింగపూర్ ప్రభుత్వాన్ని అభ్యర్థించిన విషయాన్ని గుర్తుచేశారు. వెంటనే స్పందించిన సింగపూర్ ప్రభుత్వం తమ మంత్రివర్గ సమావేశంలో చర్చించి సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే సింగపూర్ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో తమలో కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పారు. మాట ఇచ్చినట్టుగానే ఆరు నెలల్లోనే తమ రాజధాని కోసం సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసి ఇచ్చిందని గుర్తుచేశారు. తర్వాత ప్రపంచంలోనే అత్యుత్తమ కన్సల్టెంట్లను నియమించుకుని తమ రాజధానికి ప్రణాళికలు, ఆకృతులు రూపొందించుకుంటున్నామని చెప్పారు. కొత్త రాజధాని కోసం ముందుగా పర్యావరణ అనుకూల వాతావరణం సృష్టించామని తెలిపారు.
టెక్నాలజీకి దూరంగా ఉండలేం
‘సెల్‌ఫోన్ వినియోగాన్ని ప్రోత్సహించాను. ఒకప్పుడు సెల్‌ఫోన్ వాడాలంటే ప్రజలు వెనకాడేవారు. అదో భారంగా అన్పించేది. అలాంటి సెల్‌ఫోన్‌ను ఇప్పుడు సమస్యల పరిష్కారానికి వినియోగిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. టెక్నాలజీకి దూరంగా ఉండలేమని, దాని ప్రభావం నుంచి తప్పించుకోలేమని, పూర్తిగా విస్మరించలేమని చెప్పారు. వ్యవసాయ రంగంలోనూ తాము టెక్నాలజీని వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. పౌర సేవల్లోనూ సాంకేతికతను విస్తృతపరిచామన్నారు. నవ్యాంధ్రలో వ్యాపారానికి అన్నీ సానుకూలతలే ఉన్నాయని, ఎలాంటి ఆటంకాలు లేవని చెప్పారు. అన్ని అనుమతులు శరవేగంగా ఇస్తున్నామని ఆయన వివరించారు. మనిషికి ఆధార్‌లా భూమి గుర్తింపునకు భూధార్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని, ఇది విప్లవాత్మకమైన చర్యగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటు 10.5 శాతంగా ఉందని, వచ్చే 15 నుంచి 20ఏళ్ల పాటు 15శాతం వృద్ధి సాధించాలని సంకల్పం తీసుకుని పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు తాను భరోసా ఇస్తానని, ఆంధ్రప్రదేశ్‌కు రండి.. పెట్టుబడులు పెట్టండని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం తొలుత సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఎస్ ఈశ్వరన్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, ఏపీ ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్ పాల్గొన్నారు.
చిత్రం: సింగపూర్‌లో శుక్రవారం జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు