రాష్ట్రీయం

బెయిల్‌కు లంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: బెయిల్ మంజూరు కోసం లంచం తీసుకున్న కేసులో నాంపల్లి ఒకటవ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎస్.రాధాకృష్ణమూర్తి, న్యాయవాదులు కె.శ్రీనివాసరావు, జి.సతీష్‌కుమార్‌లను తెలంగాణ ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం ముగ్గురినీ ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్ధానం ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ముందు హాజరు పరిచారు. ఈ కేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ డైరక్టర్ జనరల్ కార్యాలయం విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్‌డిపిఎస్ చట్టం కింద దాఖలైన కేసులో నిందితుడైన ఎంటెక్ విద్యార్థి ఎం.దత్తుకు బెయిల్ మంజూరు చేసేందుకు జడ్జి రాధాకృష్ణమూర్తి ఇద్దరు న్యాయవాదుల ద్వారా రూ.7.5 లక్షలు లంచంగా తీసుకున్నట్లు హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది టి.శ్రీరంగారావు హైకోర్టులో ఫిర్యాదు చేశారు. బెయిల్ మంజూరుకు, తీర్పులు ఇచ్చేందుకు న్యాయమూర్తి అవినీతికి పాల్పడుతున్నారని రంగారావు ఆ ఫిర్యాదులో హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మేరకు చేపట్టిన శాఖాపరమైన అంతర్గత విచారణ అనంతరం హైకోర్టు ఈ కేసును ఏసీబీకి నివేదించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఈ నెల 11న ఆదేశించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు
చేపట్టిన ఎసిబి అధికారులు సమగ్ర వివరాలను సేకరించారు. జడ్జితో సహా మిగిలిన ఇద్దరు న్యాయవాదులపై అవినీతి నిరోధక శాఖ చట్టం కింద ఆధారాలతో సహా శుక్రవారం అరెస్టు చేశారు. ఏసీబీ అధికారులు ఈ కేసు విషయంలో లోతైన దర్యాప్తు చేపట్టారు. నేరుగా న్యాయమూర్తిపైనే ఆరోపణలు రావడంతో విచారణ కట్టుదిట్టంగా నిర్వహించారు. నిందితుల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్ డేటా మొత్తం సేకరించారు. గత ఏడాది అక్టోబర్ 31న దత్తు అనే విద్యార్ధికి మాదక ద్రవ్యాల కేసులో బెయిల్ మంజూరు చేసేందుకు నిందితులు రూ.7.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఈ ప్రకారం రూ.7.5 లక్షల నగదును స్వీకరించిన తర్వాత జడ్జి ఎస్ రాధాకృష్ణమూర్తి గత ఏడాది నవంబర్ 1న దత్తుకు బెయిల్ మంజూరు చేశారు. ఏసీబీ దర్యాప్తులో బెయిల్ కోసం దత్తు తన తల్లి బంగారు నగలను తాకట్టు పెట్టడం లేదా అమ్మడం ద్వారా రూ.7.5 లక్షలను సమీకరించిన విషయాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్ధానం ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి జారీ చేసిన సెర్చ్ వారెంట్‌ను తీసుకున్న అధికారులు జడ్జి రాధాకృష్ణమూర్తి సహా మిగిలిన ఇద్దరు న్యాయవాదుల నివాసాల్లో సోదా నిర్వహించి కీలక డాక్యుమెంట్లు, సమాచారాన్ని సేకరించారని ఏసీబీ డిజి కార్యాలయం పేర్కొంది.
చిత్రం: రాధాకృష్ణమూర్తి ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు