రాష్ట్రీయం

అమెజాన్‌ను మోసగిస్తున్న ఐదుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, ఏప్రిల్ 13: చదివింది ఇంజనీరింగ్ చేసేది మోసాలు. జల్సాలకు అలవాటు పడిన ఐదుగురు యువకులు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతుండగా సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. కర్నూలుకు చెందిన కొం డూరి దినేష్ కుమార్, గుంటూరుకి చెందిన ప్రదీప్ రె డ్డి, ప్రవీణ్ రెడ్డి, దొడ్ల బాను రమేష్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నేతిపల్లి లవ్‌కుమార్ ఉన్నత చదువు లు చదివి ఉద్యోగం కోసం వివిధ కోర్సులు చేస్తూ అ మీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. దినేష్ కుమార్ ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్ బుక్ చేసుకున్నాడు. అమెజాన్ సంస్థ సెల్‌ఫోన్ డెలీవరీ చేసింది. సెల్‌ఫోన్ అందుకున్నప్పటికీ తనకు అందలేదని ఫిర్యాదు చేయడంతో గొడవ ఎందుకని మరో ఫోన్‌ను అందించారు. ఇదే అదునుగా భావించిన యువకులు.. నోకియా, సాంసంగ్ వంటి ఫోన్‌లు బుక్ చేసి తీసుకొని, మరల తమకు ఫోన్ అం దలేదని అమెజాన్ సంస్థను బెదిరించడంతో సంస్థ అధికారులకు అనుమానం వచ్చి సైబర్ క్రైం పోలీసుల కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిం దితులను అదుపులోకి తీసుకుని విచారించగా మో సాల గురించి వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వాడుకలో ఉన్న ఫోన్ ద్వారా బుక్‌చేసి మోసాలకు పా ల్పడుతునట్లు అంగీకరించారు. మోసం చేసి పొందిన ఫోన్లను ఓఎల్‌ఎక్స్‌లో విక్రయించారని సీపీ చెప్పారు. ఏడాది నుంచి నిందితులు తొమ్మిది వందల ఫోన్లను బుక్ చేసి అదనంగా పొందారని సీపీ తెలిపారు. సు మారు రూ.15.90లక్షలు మోసం చేశారని సజ్జనార్ తెలిపారు. నిందితుల నుంచి 10.75లక్షల రూపాయల నగదుతో పాటు 556 సిమ్ కార్డులు, 42సెల్‌ఫోన్లు స్వాధీ నం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసిన సైబర్ క్రైం పోలీసులను సీపీ అభినందించారు. క్రైం డీసీపీ జానకీ షర్మిల, సైబర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్, సీఐలు సుదర్శన్ రెడ్డి, శివకుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.