రాష్ట్రీయం

ఏపీపీఎస్‌సీ గ్రూప్-3 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీపై స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ గ్రూప్-3 పరిధిలో గ్రేడ్-4 కేటగిరీ పంచాయతీ కార్యదర్శి పోస్టుల రిక్రూట్‌మెంట్‌పై ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ స్టే మంజూరు చేసింది. రెండు వారాల పాటు ఈ స్టే అమలులో ఉంటుంది. నక్కా దేవశేషు మ రో ఎనిమిది మంది అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌నను జ్యుడీషియల్ సభ్డు విజయకుమార్ విచారించారు. మెయిన్ పరీక్ష ఫైనల్ కీలో ఏడు తప్పులున్నాయని, దీం తో తాము ఎంపికయ్యే అవకాశాన్ని కోల్పోయామని అ భ్యర్థులు పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించగా, ట్రిబ్యునల్ ఏపీపీఎస్‌సీకి నోటీసులు జారీ చేసింది.
గన్‌ఫౌండ్రీ ఏపీ ఎన్జీవో భవన్ కేసు
హైదరాబాద్ గన్‌ఫౌండ్రీలోని ఏపీ ఎన్జీవో భవన్‌ను భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం సభ్యులు ఉపయోగించుకునే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ ఎన్జీవో సంఘం శుక్రవారం హైకోర్టుకు తెలిపింది. ఈ కేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టి స్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కే విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం విచారించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తదితరులు వ్యవహరిస్తున్నారంటూ భాగ్యనగర్ టీఎన్‌జీవో సంఘం కోర్టులో కోర్టు ధిక్కారం కింద పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ఎన్జీవో సంఘం తరఫున న్యా యవాది కోర్టుకు హాజ రై ఏపీ ఎన్జీవో భవన్‌లో 15 గదు లు, కాన్ఫరెన్సు హాలు ఉన్నాయని తెలిపారు.
ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి, వాచ్‌మెన్ నంబర్లను భాగ్యనగర్ తెలంగాణ సంఘానికి ఇచ్చామని, అవసరమైనప్పుడు ఫోన్ చేస్తే ఈ భవన్‌ను ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని న్యా యవాది కోర్టుకు తెలిపారు. అనంతరం కోర్టు కోర్టు ధి క్కారం కేసును మూసివేసింది.