రాష్ట్రీయం

రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతున్నదని టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రవణ్ దాసోజు విమర్శించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఇసుకను కొల్లగొడుతూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని కొండూరు, తూమ్‌కుంట, సింగవరం ప్రాంతాల్లో ఉన్న వాగుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను ప్రతి రోజూ దాదాపు 40 ట్రక్కుల్లో 200 ట్రిప్పుల చొప్పున తరలిస్తున్నారని ఆయన తెలిపారు. సుమారు 30 కోట్ల రూపాయల విలువ గల ఇసుకను అమరగిరి ప్రాంతం నుంచి కృష్ణా నది మీదుగా భారీమర బోట్ల ద్వారా తరలిస్తూ రాయలసీమలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు విక్రయిస్తున్నారని ఆయన చెప్పారు. రిజర్వ్‌డ్ ఫారెస్టు, ట్రైగర్ జోన్లు ఉన్నప్పటికీ రెవెన్యూ, అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించి కనీసం దరఖాస్తు కూడా చేయకుండా ఇసుకను తరలిస్తున్నారని డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆరోపించారు.