రాష్ట్రీయం

వేడుకల స్థానంలో టీడీపీ నిరశనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 15: కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన తెలుగుదేశం పార్టీ ఈ నెల 20వ తేదీ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజున గల్లీ నుంచి ఢిల్లీ వరకూ నిరశన దీక్షలు చేపట్టనుంది. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న కారణంగా గత కొంతకాలంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం, ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలు కలిపి 19 అంశాల్లో కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయకుండా మొండిగా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. గత నాలుగేళ్లుగా న్యాయం కోసం ఎదురుచూసినా ప్రయోజనం లేదని కేంద్ర ప్రభుత్వం నుంచి పార్టీ తరఫున మంత్రులుగా ఉన్న ఇద్దరితో రాజీనామా సైతం చేయించారు. ఆ తర్వాత ఆందోళన కార్యక్రమాలకు తెరదీసిన టీడీపీ కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచేందుకు చంద్రబాబు పుట్టిన రోజున స్వయంగా ఆయనే నిరాహార దీక్షకు కూర్చోవడానికి సిద్ధపడ్డారు. దీంతో ఆయనకు సంఘీభావంగా అన్ని మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు దీక్షలు చేయాలని పార్టీ నిర్ణయించింది. దీంతో ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించకుండా టీడీపీ శ్రేణులు మొత్తం నిరసన కార్యక్రమాల్లోనే పాల్గొనాలని పార్టీ సూచించింది. రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీలో ఒక రోజు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.