రాష్ట్రీయం

బాబు దీక్ష ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 15: విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా, తదితర అంశాల్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్ష చేపట్టనున్నారు. విజయవాడ నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిరసన దీక్ష చేపట్టాలని ఆదివారం నిర్ణయించారు. రాష్టవ్య్రాప్తంగా ఆరోజు చేపట్టనున్న దీక్షలకు సంబంధించి ఉండవల్లిలోని తన నివాసం నుంచి దాదాపు 500 మంది టీడీపీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు సేకరించారు. ఎన్డీయే నుంచి బయటకు రావడం, బీజేపీ నేతల వ్యాఖ్యలు, తాజా రాజకీయ పరిణామాలను ఈ సందర్భంగా పార్టీ నాయకులకు సీఎం వివరించారు. ఆరోజు ఉదయం 9 గంటలకే దీక్షకు కూర్చోవాలని నిర్ణయించారు. మండల, జిల్లా కేంద్రాల్లో నేతలు కూడా దీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం దళితతేజం బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సోమవారం జరిగే పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో దీక్షకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయనున్నారు.