రాష్ట్రీయం

మోదీ.. ఏపీతో పెట్టుకోకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, ఏప్రిల్ 15 : రాష్ట్ర విభజన హామీలను తుంగలో తొక్కుతున్న ప్రధాని నరేంద్రమోదీకి తెలుగు వారి తడాఖా ఏంటో చూపిస్తామని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు. మోదీ ఏపీతో పెట్టుకోకు, తెలుగువారి తడాఖా ఏమో చూపిస్తాం.. ఇకనైనా విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలోని లేపాక్షి చెరువుకు హంద్రీనీవా ద్వారా చేరిన నీటికి ఆదివారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు మంత్రి దేవినేని ఉమా, ఎంపీ నిమ్మల కిష్టప్ప జలహారతి ఇచ్చారు. అనంతరం లేపాక్షిలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో వారు మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం అశాస్ర్తియంగా రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిందన్నారు. అప్పట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ తమకు మద్దతు పలుకుతూ ఏపీకి 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిందన్నారు. దీంతో గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీపై నమ్మకంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. అయితే యూపీఏ ప్రభుత్వం తరహాలోనే ప్రస్తుతం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 3 వేల కోట్ల దాకా నిధులు మంజూరు చేయాల్సి ఉండగా కేంద్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ముస్లిం మైనార్టీలను వైఎస్ జగన్ మభ్య పెట్టారని, ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీతో లాలూచీ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. మోదీ, జగన్ పట్ల ఆయా వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. గతంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయగా ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు అప్పటి కేంద్ర ప్రభుత్వాలకు గట్టి గుణపాఠం చెప్పారన్నారు. నియంతలా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ, బీజేపీకి కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు.