రాష్ట్రీయం

ప్రజల వద్దకు వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలను ప్రజల చెంతకు తీసుకెళ్లడంలో వైద్య శాఖ ముందడుగు వేస్తోంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వైద్య పరీక్షలను నిర్వహించి మహమ్మారి రోగాలను ముందుగా కనిపెట్టేందుకు వైద్య శాఖ చేపట్టిన కసరత్తు 12 జిల్లాల్లో పూర్తయింది. ఈ పథకం కింద అంటు వ్యాధి కాని రోగాలను (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) గుర్తించే ప్రక్రియ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆరు నెలల క్రితం రాష్ట్రప్రభుత్వం మొదలు పెట్టింది. రక్తపోటు, మధుమేహం, అనుమానిత క్యాన్సర్, నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్‌లను గుర్తించే ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలను గ్రామ ప్రాంతాల్లో నిర్వహించారు. దాదాపు 14.60 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు. ఇందులో పురుషులు 6.11 లక్షల మంది, మహిళలు 8.49 లక్షల మంది ఉన్నారు. రక్తపోటు 83 వేల మందికి, మధుమేహ వ్యాధి 74వేల మందికి, అనుమానిత క్యాన్సర్ 13వేల మందికి, నోటి క్యాన్సర్ 9300 మందికి, గర్భాశయ క్యాన్సర్ 2800 మందికి, రొమ్ము క్యాన్సర్ 1750 మందికి ఉన్నట్లు
గుర్తించారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఇంతవరకు స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయ్యాయి. వచ్చే నాలుగు నెలల్లో మిగిలిన జిల్లాల్లో స్క్రీనింగ్ పరీక్షలు పూర్తవుతాయని వైద్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారికి హైదరాబాద్‌లోని ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రుల్లో వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రక్తపోటు, మధుమేహ వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల భవిష్యత్తులో గుండె, కిడ్నీ రోగాల బారిన ప్రజలు పడకుండా చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో రక్తపోటు, మధుమేహ వ్యాధి వల్ల చాలా మంది మృత్యువాత పడుతున్నారు.