ఆంధ్రప్రదేశ్‌

గ్రామాల్లో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 21: రాష్ట్రంలో రైతులు స్వయంగా వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసే కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులను గ్రామాల్లో నెలకొల్పే దిశగా ప్రోత్సహించాల్సి ఉందని, ఇందుకు ఒక ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. శనివారం ‘వార్షిక వ్యవసాయ ప్రణాళిక 2018-19’పై ఆయన వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షించారు. వ్యవసాయం అనుబంధ రంగాల్లో భాగంగా మార్కెటింగ్ శాఖపై సమీక్షిస్తూ రైతులు తమ పంట ఉత్పత్తులకు సరైన ధరలు వచ్చేదాకా నిల్వ చేసుకునే గోదాములు గ్రామాల్లోనే ఉండాలని, ఇందులో రైతాంగాన్ని భాగస్వాములను చేయాలని ఆదేశించారు. వ్యవసాయశాఖ సలహాదారు విజయకుమార్ మాట్లాడుతూ హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విధానాలను అనుసరిస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65వేల హెక్టార్లలో 1.65 లక్షల రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారని వివరించారు. ఈ ఏడాది మొక్కజొన్న పండించే రైతుల సంఖ్య ఐదు లక్షలకు చేరగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెటింగ్‌లో కూడా ఇటువంటి ధరలు హఠాత్తుగా పడిపోవటం లాంటి అంశాలపై ముందస్తుగా రైతాంగానికి సూచనలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం కోర్ డ్యాష్ బోర్డును ఎప్పటికప్పుడు తాజా సమాచారంలో తీర్చిదిద్దాలని కోరుతూ వ్యవసాయ మార్కెటింగ్ సమాచారాన్ని కూడా కోర్ డ్యాష్ బోర్డులో ప్రతి నెలా 15వ తేదీకల్లా తాజాగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. దేశంలో ఈ దిశగా ‘అగ్రివాచ్’ పనితీరు బాగుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ-ప్రగతితో సమ్మిళితమై, సీఎఫ్‌ఎంఎస్ ప్యాకేజీతో ఈ-ట్రాన్స్‌పోర్టు వ్యవస్థను జూలై 1 నాటికి ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. అగ్రికల్చరల్ మార్కెటింగ్‌కు కమిషనే కస్టోడియన్‌గా ఉంటుందన్నారు. రాష్ట్రంలో 47 మార్కెట్లు మార్క్‌ఫెడ్ ద్వారా ధాన్య సేకరణ చేస్తున్నాయని, మొత్తం 90 మార్కెట్లలో 69 పనిచేస్తున్నాయని, ఇతర 47 మార్కెట్లకు గాను భారత ప్రభుత్వానికి జీపీఆర్‌లు పంపించనున్నట్లు తెలిపారు. గుంటూరు మార్కెట్ యార్డు రూ.8,400 కోట్ల మేర ఇ-ట్రేడ్ చేసి ఈ ఏడాది దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. గుంటూరులో అరవై శాతం సాధారణ లావాదేవీలు జరిగాయని, 40శాతం ఆన్‌లైన్ చెల్లింపులున్నాయని చెప్పారు. వ్యవసాయోత్పత్తులను శీతల నిల్వ కేంద్రాలు, గిడ్డంగుల ద్వారా నిల్వ చేయాలని, ధరలు వచ్చినప్పుడు వాటిని విక్రయించుకునే సదుపాయాల కల్పనలో రైతులను భాగస్వాములుగా చేయాలని ఆదేశించారు.