ఆంధ్రప్రదేశ్‌

విరగబూసిన బ్రహ్మకమలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురబలకోట, సెప్టెంబర్ 2: చిత్తూరు జిల్లా కురబలకోట మండలం మద్దిరెడ్డిగారిపల్లెకు చెందిన మొరుంపల్లె రంగారెడ్డి ఇంటి ఆవరణలో శనివారం రాత్రి దాదాపు 90 బ్రహ్మకమలం పుష్పాలు వికసించాయి. ఈ పుష్పాలు చూపరులను కనువిందు చేశాయి. రాత్రివేళల్లో మాత్రమే వికసించడం వీటి ప్రత్యేకత. సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఈ పూలు పూస్తాయని రంగారెడ్డి భార్య, కురబలకోట జడ్‌పిటిసి మొరుంపల్లె ధనలక్ష్మి ఆదివారం ఈ విలేఖరికి తెలిపారు. అదీ కొన్ని గంటలు మాత్రమే వికసించి వాడిపోతాయన్నారు. రాత్రుల్లో వికసించిన వాటిని చూడటం కూడా భాగ్యంగా భావిస్తారన్నారు. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ రెండు, మూడు పూలు వికసించడం మామూలే. తమ ఇంట వేసిన మొక్క ఒకేసారి 90 పూలు వికసించాయన్నారు. ఇది అరుదైన విషయమన్నారు. బెంగళూరు నుండి రెండేళ్ల క్రితం ఈ మొక్కను తెచ్చి నాటామన్నారు. నిరుడు ఆరు పూలు పూసిందన్నారు. ఈసారి ఏకంగా మొక్కంతా విరగబూసిందన్నారు. పరిసర ప్రాంతాల మహిళలు ఎంతో ఆసక్తిగా చాలాసేపు ఆశ్చర్యంగా ఎదురుచూశారని తెలిపారు.