ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర పథకాలకు పీఐబీ క్షేత్రస్థాయి ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 4: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు క్షేత్రస్థాయిలో ప్రచారానికి పీబీఐ (ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో) కృషిచేస్తోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పీఐబీ ఆధ్వర్యంలో మంగళవారం ‘వార్తాల్యాప్’ పేరిట విలేఖరులకు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే లు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పీబీఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసేందుకు తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాచార వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోందని, అందుకు అనుగుణంగా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రభుత్వానికి, మీడియాకు మధ్య వారధిగా పనిచేస్తుందన్నారు. ఏదైనా అంశంపై ప్రజల్లో అపోహలు ఏర్పడినపుడు వాటిని నివృత్తి చేసేలా పీఐబీ విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలకు వివిధ సాంస్కృతిక, కళారంగాల ద్వారా, పత్రికా, మాధ్యమాల ప్రకటనల ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పీఐబీ సేవలు వివరించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గాలకు చెందిన వివిధ పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. రాజమహేంద్రవరం మహిళా విభాగం డిఎస్పీ భరత్ మాతాజీ, సీనియర్ పాత్రికేయుడు మురళీశంకర్ తదితరులు మాట్లాడారు.