ఆంధ్రప్రదేశ్‌

ఈర్ష్యతోనే ఉండవల్లి అసత్య ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 4: అమరావతి బాండ్లపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈర్ష్యతోనే అసత్యప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2009లో టీడీపీ ప్రచురించిన ‘రాజా ఆఫ్ కరప్షన్’ పుస్తకంపై ఉండవల్లి బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. అమరావతి టాక్స్ ఫ్రీ బాండ్లు కావని స్పష్టంచేశారు. గంటలోపే రూ 2వేల కోట్ల మేర అమరావతి బాండ్లు జారీ అయినప్పటి నుంచి ప్రతిపక్షాలు అక్కసు వెళ్లబోసు కుంటున్నాయని మండిపడ్డారు. తాము ఇచ్చే వడ్డీరేటు కంటే ఎవరు తక్కువ ఇచ్చినా ఎరేంజ్డ్ ఫీజు చెల్లిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వాలు చేసిన అప్పులపై 75 శాతం వడ్డీ చెల్లించటం వల్లే ఆర్థిక భారం పెరిగిందన్నారు. ఆర్థిక అంశాలపై ప్రజలకు అవగాహన ఉండదనే భావనతో పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సెబీ కింద గుర్తింపు పొందిన సంస్థలు కూడా బిడ్‌లో కోట్ చేశాయని, పారదర్శకంగా బిడ్డింగ్ నిర్వహించామన్నారు. యూసీలు ఏ విధంగా ఇస్తారో ఉండవల్లికి తెలియనిది కాదన్నారు. కేంద్రం సహకరించకపోయినా పనులకు అంతరాయం కలుగకూడదనే ఉద్దేశ్యంతో అమరావతి బాండ్లను విక్రయానికి పెట్టామన్నారు. ఉపాధి హామీ పథకం పనుల్లో పురోగతికి 10 జాతీయ అవార్డులు లభించాయని పారదర్శకతకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. ఉండవల్లి చిల్లర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జీఎస్‌డీపీ 7 రెట్లు పెంచాలని అప్పడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నిర్ణయించారని, విభజన తరువాత ఏపీలో ప్రస్తుతం 14 రెట్లు జీఎస్‌డీపీ పెరిగిందని దీన్ని అవహేళన చేయటం రాజకీయ దురుద్దేశ్యంతోనే అన్నారు. మరో మూడేళ్లలో సీఆర్డీఏ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని ఈ విషయం తెలిసే ఇనె్వస్టర్లు అమరావతి బాండ్లపై ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.