ఆంధ్రప్రదేశ్‌

ఆదాయ వనరుల అనే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 4: ఆదాయ వనరులపై ప్రభుత్వం దృష్టి సారించింది. పన్నులు, ఇతర మార్గాల్లో రావాల్సిన పెండింగ్ బకాయిల లెక్కలు తీస్తోంది. గత మూడేళ్లలో వివిధ శాఖల ద్వారా రూ 6, 248 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ కావాల్సి ఉంది. వీటిని తక్షణం వసూలుచేసే విషయమై ఆయాశాఖల ముఖ్య కార్యదర్శులతో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామ కృష్ణుడు అధ్యక్షతన సచివాలయంలో మంగళవారం కీలక సమావేశం జరిగింది. శాఖల వారీగా వసూలు కావాల్సిన రెవెన్యూ బకాయిలపై అధికారులను అడిగి మంత్రి యనమల వివరాలు తెలుసుకున్నారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ గౌతమ్ సవాంగ్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రవిచంద్ర తమ పరిధిలో వసూలు కావాల్సిన బకాయిలను వివరించారు. 2015 నుంచి 18 వరకు మూడేళ్ల కాలానికి రెవెన్యూ (నాలా) నుంచి రూ 1,209 కోట్లు, వాణిజ్యపన్నులశాఖ రూ 1,264 కోట్లు రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ రూ 776 కోట్లు, గనులు, భూగర్భ శాఖ పరిధిలో రూ 487 కోట్లు, కార్మికశాఖ కు రూ 441 కోట్లు మేర రెవెన్యూ బకాయిలు వసూలు కావాల్సి ఉంది. మిగిలిన శాఖల నుంచి వేల కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో ఇంత పెద్దమొత్తంలో బకాయిలు పేరుకు పోవటానికి కారణాలను మంత్రి యనమల అడిగి తెలుసుకున్నారు. ఇదేమీ చిన్నమొత్తం కాదని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బకాయిలు వసూలయితే ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. బకాయిల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. శాఖలు, సంస్థలు, వ్యక్తుల వారీగా రెవెన్యూ బకాయిల నివేదిక రూపొందించాలన్నారు. వన్ టైమ్ సెటిల్‌మెంట్లతో మేలు జరుగుతుందన్నారు. కేసుల పేరుతో కొందరు వ్యక్తులు, సంస్థలు పన్నులు చెల్లించటంలేదని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై యనమల స్పందిస్తూ జిల్లా వారీగా సమీక్షలు నిర్వహించి ఏయే కేసులు ఉన్నాయి.. వాటి వివరాలను పొందు పరుస్తూ నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎక్కువ మొత్తంలో బకాయిలు ఉన్నవారని గుర్తించాలన్నారు. వారితో నేరుగా సంప్రతించాలని, అవసరమైతే నిబంధనలకు అనుగుణంగా వన్‌టైమ్ సెటిల్‌మెంట్లకు చర్యలు చేపట్టాలని సూచించారు. దీనివల్ల బకాయిదారులు కూడా చెల్లింపులకు ముందుకొస్తారని చెప్పారు. రెవెన్యూ వసూళ్లలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టంచేశారు. నిబంధనల కనుగుణంగా పన్నుల వసూళ్లు గనులు, భూగర్భశాఖలో రూ 198 కోట్ల మేర రెవెన్యూ బకాయిలు ఉన్నాయని, వాటికి అపరాథ రుసుముగా మరో 12 వందల కోట్లు జమ కావాల్సి ఉందని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ్ధర్ తెలిపారు. పన్నుల వసూలులో చట్టాల కనుగుణంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇష్టారాజ్యంగా అపరాధరుసుముల వసూలుకు ప్రయత్నిస్తే సంబంధిత వ్యక్తులు కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని హెచ్చరించారు. బకాయిల వసూళ్లపై సమీక్షలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. రెవెన్యూ బకాయిలు వసూలైతే రాష్ట్రంలో అభివృద్ధి పథకాల అమలు ఊపందుకుంటుందని తెలిపారు. బకాయిల వసూళ్లకు అన్నిశాఖల మంత్రులు, కార్యదర్శులకు లేఖలు రాయాలని ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్రను ఆదేశించారు. బకాయిలపై సమీక్ష జరపాలన్నారు. మరో 45 రోజుల తరువాత నిర్వహించే సమావేశంలోగా బకాయిల వసూళ్లలో లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాంబశివరావు, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ గౌతమ్ సవాంగ్, ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్ర ముగ్గురూ వసూళ్లను పర్యవేక్షించాలని సూచించారు. అన్ని శాఖల బకాయిల వివరాలతో సాఫ్ట్‌వేర్ రూపొందిద్దామని రవిచంద్ర తెలిపారు. దీనివల్ల బకాయిలు, వసూళ్ల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. ఆర్థికశాఖ ప్రతిపాదనకు యనమల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సిబ్బంది కొరత వల్ల పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించలేకపోతున్నామని గౌతమ్ సవాంగ్ మంత్రి దృష్టికి తెచ్చారు. వివరాలతో నివేదిక పంపితే ఆమోదిస్తామని యనమల హామీ ఇచ్చారు. సమీక్షా సమావేశంలో ఎక్సైజ్, ప్రొహిబిషన్‌శాఖ కమిషనర్ లక్ష్మీనారాయణ, వాణిజ్యపన్నులశాఖ కమిషనర్ శ్యామలరావుతో పాటు అటవీ, మైన్స్, ఇతర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.