ఆంధ్రప్రదేశ్‌

సామాన్య భక్తులకు ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 4: దసరా ఉత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎటువంటి వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదేశించారు. విజయవాడ దుర్గగుడి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై మంగళవారం ఆయన వెలగపూడి సచివాలయంలో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా వీఐపీలకు దర్శనం కల్పించాలన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సంవత్సరం జరుగనున్న దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఉందని, దసరా రోజున అమ్మవారికి రెండు అలంకారాలు చేయాలని మంత్రికి దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. ఉదయం మహిషాసుర మర్ధిని అలంకారం, మధ్యాహ్నం రాజరాజేశ్వరి అలంకారం చేయాల్సి ఉంటుందన్నారు. అలంకరణ మార్చే సమయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ భక్తులకు దర్శనం నిలిపివేస్తామన్నారు. ఆ రోజు ఉదయం 3 గంటల నుంచే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. దసరా రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అలంకరణ మార్పు కోసం రెండు గంటల పాటు దర్శనం నిలిపివేస్తామని తెలిపారు. దీనిపై స్పందించిన కేఈ మాట్లాడుతూ ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. భక్తులకు అవగాహన కల్పించాలన్నారు. క్యూలైన్‌లో ఉన్న భక్తులకు ఇబ్బంది కలుగకుండా పాలు, మంచినీరు అందించాలన్నారు. వీఐపీల పార్కింగ్, వారికి త్వరితగతిన దర్శనం వంటి వాటికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రసాదాలకు అదనంగా అప్పం ప్రవేశపెట్టాలని నిర్ణయించామని, ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్న ప్రసాదంగా కదంబం అందిస్తామన్నారు. రద్దీ నియంత్రణకు పోలీసులతో, విద్యుత్ నిరంతర సరఫరాకు ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి తెలిపారు. దేవాలయ పరిసరాల్లో అదనంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దేవదాయ సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థుల సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు.